ad1
ad1
Card image cap
Tags  

  01-06-2024       RJ

ప్రైవేట్‌ స్కూళ్లను నియంత్రించే చర్యలేవీ ?

ఆంధ్రప్రదేశ్

  • అధిక ఫీజులపై నోరు మెదపని ప్రభుత్వాలు
  • ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేస్తున్న స్కూళ్లు

విజయవాడ, జూన్‌ 1: ఫీజులు పెంచినా కిక్కురుమనకుండా పిల్లలను స్కూల్లో చేర్పిస్తున్నారు. ఇలా చేయడం ప్రైవేట్‌ స్కూళ్ల యాజామాన్యాలకే బాగా తెలుసు. ఎక్కడ డబ్బులు ఎలా రాబట్టాలో వారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ప్రభుత్వాలు కూడా ఇంతవరకు వారిని ఏవిూ అనడం లేదు. ముక్కుపిండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా నియంత్రణ లేదు. స్కూళ్ల ప్రారంభానికి ముందే ఫీజులను వసూలు చేసుకున్నారు. కొన్ని స్కూళ్లు ఫీజులను వసూలు చేశాక మెల్లగా నెలాఖరు వరకు ఆన్‌లైన్‌ క్లాసులంటూ.. విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పారు. బడిబాట పేరుతో ఆర్భాటాలు చేస్తున్న ప్రభుత్వాలు ప్రైవేట్‌ స్కూళ్ల పై నియంత్రణ కోల్పోయాయి. ఎందకంటే వారిచ్చే ఆమ్యామ్యాలే వారికి ముఖ్యం కనుక వారిపై ఈగ వాలదు.

నిజానికి వారు మన చట్టం పరిధిలో ఉన్నారా అన్న అనుమానాలు కూడా కలగమానదు. ఇక సర్కార్‌ బళ్లల్లో ఉపాధ్యాయుల కొరత, పదోన్నతులు వంటి సమస్యలు ఉండనే ఉన్నాయి. ఈ దశలో విద్యారంగం పటిష్టత కోసం గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కెజి టూ పిజి అన్న ప్రతిపాదన కోల్డ్‌ స్టోరేజీకి వెళ్లింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్‌ మాధ్యమం పేరుతో హడావిడి చేస్తున్నా... బోధనోపాధ్యాయుల నియామకం జరగలేదు. అలాగే పుస్తకాల ముద్రణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయులు లేక అనేక స్కూళ్లు మూతపడి వున్నాయి. గిరిజన గ్రామాలకు నేటికీ రవాణా సౌకర్యం లేదు. వారికి కరెంట్‌ అంటే ఏమిటో తెలియదు. విద్యవైద్యం వారి దరికి చేరడం లేదు.  

కొన్నిచోట్ల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు, లెక్కలు, భౌతిక శాస్త్రం, సామాన్య శాస్త్రాలకు సబ్జెక్టు టీచర్లు లేరు. కొన్ని వేల స్కూళ్లు 5 తరగతులకు కలిపి ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. విద్యలో తెలుగు రాష్ట్రాలు వెనకబడి పోవడానికి సరైన దృక్పథం, చిత్తశుద్ది లేకపోవడంగా చూడాలి. ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం కారణంగా విద్యారంగం కుదేలవుతోంది. దేశవ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది. ఇకపోతే ఇంగ్లీషు మాధ్యమంతో ముందుకు పోదామని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. తెలుగు విూడియం ఎందుకు వద్దని అడిగితే పేదలకు ఇంగ్లీషు వద్దా? అన్న చర్చ సాగింది. నాయకుల పిల్లలు ఇంగ్లీషులో చదువుకుంటుంటే పేదల పిల్లలు చదువు కోకూడదా? అన్న మౌళిక ప్రశ్నలు వచ్చాయి.

డబ్బున్న వాళ్ళు లక్షల రూపాయలు పోసి ఇంగ్లీషులో చదువుకోగా, పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఇంగ్లీషు చదువు చెప్పడం తప్పా? అని వేస్తున్న ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. అయితే అందుకు అనుగుణంగా బోధనా సిబ్బందిని,మౌళిక వసతులను కల్పిస్తే ఎవరూ కాదనరు. అలాగని తెలుగును నిర్లక్ష్యం చేయరాదు. ఇంగ్లీషు మాధ్యమం పెట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయొద్దనే అడుగుతున్నారు. అయితే ఇంగ్లీష్‌ విూడియం ప్రకటించడానికి ముందు ఆ మేరకు స్కూళ్లను, తయారు చేసి టీచర్లను నియమించాల్సి ఉంది. ప్రకటనలు బాగున్నా ఆచరణలో పక్కా ప్రణాళిక ఉండాలి. మాధ్యమం గొడవ పక్కన పెట్టి పిల్లలందరికి విద్యను చేరువ చేసే కార్యక్రమం జరగాలి. ఏ ఒక్క పిల్లవాడు బడిబయట లేకుండా చేయాలి. అప్పుడు తెలుగా, ఇంగ్లీషా అన్న తర్కం చేయవచ్చు.

మాతృభాష ద్వారానే జాతి సంస్కృతి, సాంప్రదాయాలు నిలబడతాయని నిపుణుల అభిప్రాయం. అతి చిన్న దేశాలు మొదలు అతి పెద్ద జనాభా గల చైనా వరకు అన్ని దేశాలూ వారి మాతృ భాషలోనే ప్రాథమిక విద్య బోధిస్తున్నాయి. కొన్ని దేశాలు పి.జి వరకు మాతృభాషనే వాడుకుంటున్నాయి. జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌తో సహా అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు మాతృభాష మాధ్యమంలోనే నడుస్తున్నాయి. చిన్న దేశమైన క్యూబా మాతృభాష లోనే వైద్యంలో అద్భుతాలు సాధించింది. మన దేశంలో అన్ని రాష్టాల్రు వారి భాషా మాధ్యమంలో విద్యను కొనసాగిస్తున్నాయి. విద్యలో దేశంలోనే కేరళ ముందున్నది. అది కూడా మాతృభాష లోనే ప్రాథమిక విద్యను అందిస్తున్నది. కేరళ ప్రజలే ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

ఇంగ్లీషు నేర్చుకోవడంలో తప్పులేదు. మాతృభాషలో బోధన చేస్తూనే ఇంగ్లీష్‌, హిందీ భాషలు నేర్పితే సరిపోతుంది. ఇంగ్లీషు భాషలో అర్థం చేసుకోవడం కష్టం. ఇంగ్లీషు తెలియని ఇళ్ళు, సమాజం నుండి వివరణ అడిగి తెలుసుకునే అవకాశం తక్కువ. అందువలన ప్రాథమిక విద్యా స్థాయిలో... ఆంగ్ల మాధ్యమంలో విషయ పరిజ్ఞానం, జ్ఞాన సంపాదన కష్టం. పైగా పేదలు తమ పిల్లలకు డబ్బు పెట్టి ట్యూషన్‌కు పంపించలేరు. టీచర్లను పెట్టి చదివించుకోలేరు. అన్ని విధాలా పేదల పిల్లలు ఇంగ్లీషు మాధ్యమంలో నష్టపోవడం ఖాయం. డబున్న వాళ్లకు అన్ని అవకాశాలు వుంటాయి గనుక ఏ మాధ్యమమైనా ఫర్వాలేదు. ముందుగా ప్రతి ఒక్కరికి చదువు అన్నది నినాదంగా..దేశంలో జాతీయోద్యమంగా సాగాలి.

ముందు ప్రైవేట్‌ స్కూళ్లపై అజమాయిషీ చేయాలి. డబ్బులు గుంజే విధానాన్ని అరికట్టాలి. వారు చట్టానికి లోబడి ఉండేలా చూడాలి. అంతేగాని వారిని పట్టించుకోకుండా.. వసూళ్లు చేసుకునేలా ప్రోత్సహించడం అరాచకం తప్ప మరోటికాదు. ఫీజుల నియంత్రణపై వేసిన కమిటీలు ఇచ్చిన సూచనలు బుట్టదాఖలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఆలోచించేలా తప్ప యాజమాన్యాల పక్షాన కాదని గుర్తించాలి. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. బోధానా సిబ్బందిని నియమించి, మౌళిక వసతులు కల్పిస్తే ప్రజలు తప్పకుండా సర్కార్‌ బడులనే ఆశ్రయిస్తారు. 

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP