01-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 1: లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కోసం హైదరాబాద్ జిల్లా పరిధిలో అన్ని సిద్ధం చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని వెల్లడిరచారు. కౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 13 ప్రాంతాల్లో 16 హాల్స్‌లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామని రొనాల్డ్ రాస్ అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిజాం కాలేజీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని చెప్పారు. ప్రతి కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో 20 టేబుళ్లు, యాకుత్‌పురాలో 24 రౌండ్లలో, చార్మినార్ నియోజకవర్గంలో 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
ఇక కంటోన్మెంట్ ఉపఎన్నిక ఓట్లను 17 రౌండ్లలో లెక్కిస్తామని చెప్పారు. ప్రతి రౌండ్‌కు 30 నిమిషాల సమయం పడుతుందన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కిస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అబ్జర్వర్ ఉంటారని చెప్పారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎన్‌కోర్‌లో డేటా నమోదు చేస్తారన్నారు. కౌంటింగ్ సిబ్బందికి మే 26 నాటికే శిక్షణ పూర్తయిందని తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని 8 గంటల కంటే ముందు పార్టీల ఎజెంట్ల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్‌లు ఓపెన్ చేస్తామని వెల్లడిరచారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నాంపల్లి, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీలలో ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుల్స్ ఉంటే జూబ్లీహిల్స్ లో మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. తొలిఫలితం చార్మినార్ వచ్చే అవకాశం ఉందని మధ్యాహ్నం మూడు గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు 17 రౌండ్లు ఉంటాయని 12వందల మంది సిబ్బందిని కేవలం కౌంటింగ్ కు వాడుతున్నామని చెప్పారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు అబ్జర్వర్లు ఉంటారని తెలిపారు.
కౌంటింగ్ సిబ్బందికి మే 26 నాటికే శిక్షణ పూర్తయిందని రొనాల్డ్‌రాస్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ ఉంటారని తెలిపారు.ప్రతి కౌంటింగ్ కేంద్రంలో విూడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.హైదరాబాద్‌లోని 13 ప్రాంతాల్లో 16 హాల్స్‌లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశాం. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 20 టేబుళ్లు ఉంటాయి. యాకుత్‌పురాలో అత్యధికంగా 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. చార్మినార్ నియోజకవర్గంలో 15 రౌండ్లలో, కంటోన్మెంట్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో జరుగుతుంది. ప్రతి రౌండ్‌కు 30 నిమిషాల సమయం పడుతుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కిస్తామని రొనాల్డ్‌రాస్ తెలిపారు.