01-06-2024 RJ
సినీ స్క్రీన్
శర్వానంద్, కృతి శెట్టి జంటగా వస్తున్న సినిమా ’మనమే’ జూన్ 7న విడుదలవుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు, నిర్మాత టిజి విశ్వప్రసాద్. ఈ నేపధ్యంలో కథానాయకురాలు కృతి శెట్టి మూవీ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు సుభద్ర. ఇప్పటి వరకూ నేను చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా వుంటుంది. నాకు చాలా కొత్తగా వుంటుంది. ఇప్పటివరకూ క్యూట్, సాప్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ ఈ క్యారెక్టర్ చాలా స్టిక్ట్ గా వుంటుంది. షూటింగ్ సమయంలో డైరెక్టర్ శ్రీరామ్ గారిని ఇంత స్టిక్ట్ గా వుంటుందా?! అని చాలా సార్లు అడిగాను. ఆయన అంత స్టిక్ట్ గా కావాలని చెప్పారు. ఆయన విజన్‌ని ఫాలో అయ్యాను. పర్శనల్ గా నాకు పెద్ద కోపం రాదు. పెద్దగా అరవను. చాలా కామ్ గా వుంటాను.
సుభద్ర క్యారెక్టర్ నాకు పూర్తిగా కొత్త. శర్వానంద్ గారు వన్ అఫ్ ది బెస్ట్ పెర్ఫార్మర్. నిన్న సినిమా చూశాను. ఆయన ప్రతి సీన్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన ఎక్స్ పీరియన్స్ కనిపించింది. ఇందులో నాకు ఓ ఫేవరట్ సీన్ వుంది. ఆ సీన్ కోసం చాలా వెయిట్ చేశాను. ఎలా చేయాలో అని చాలా అలోచించాను. కానీ శర్వానంద్ గారు చాలా కాజ్యువల్ గా వచ్చి ఆ సీన్ ని ఒక్క నిమిషంలో అద్భుతంగా ఫినిష్ చేశారు. నేను స్టన్ అయిపోయాను. శర్వానంద్ గారు పెర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంటుంది. అందులో ఒక బేబీ కూడా వుంది. బేబీ తో షూట్ చేయడం అంత ఈజీ కాదు. అయితే శర్వానంద్ గారు చాలా బ్యూటీఫుల్ గా హ్యాండిల్ చేశారు.
’మనమే’ స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ వున్న ఎంటర్ టైనింగ్ ఫిల్మ్. ఇందులో వండర్ ఫుల్ కిడ్, పేరెంట్ ఎమోషన్ వుంది. అది గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మా ముగ్గురి క్యారెక్టర్స్ చుట్టూ వుంటుంది. అందుకే మనమే అనే పేరు పెట్టాం. ఇది పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రతి సీన్ లో ఎంటర్ టైన్మెంట్ వుంటుంది.సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో వుండదు. మన చేతిలో లేని విషయాలు గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదని ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను.నాకు ప్రిన్సెస్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. ’బాహుబలి’ లో అనుష్క గారి లాంటి క్యారెక్టర్స్. అలాగే యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ వున్న రోల్స్ చేయాలని వుంది.మూడు తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నాను. అలాగే టోవినో థామస్ తో ఒక మలయాళం ఫిల్మ్ చేస్తున్నాను అని వివరించారు.