01-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి, జూన్ 1: ఏర్పేడు మండలం రాజులపాలెంలోని సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అల్యూమినియం తుక్కు కరిగించే క్రమంలో చిన్నపాటి గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో దాదాపు 50 మంది కార్మికులు ఉన్నట్టుండి వాంతులు చేసుకొని సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పరిశ్రమ యాజమాన్యం వారిని వెంటనే రేణిగుంట బాలాజీ ఆస్పత్రికి తరలించింది. వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్యం మెరుగుపడిన కార్మికులను తిరిగి పరిశ్రమకు తీసుకొచ్చారు. కొందరు కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
ప్రమాదశాత్తూ ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో సుమారు 50మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 25మంది మహిళలు ఉండటం గమనార్హం. అస్వస్థకు గురైన కార్మికులను హుటాహుటిన రేణిగుంట బాలాజీ హాస్పిటల్‌కు తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు. విష వాయువు లీక్ అయ్యిందన్న సమాచారంతో స్థానిక గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారు.