01-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 1: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు, పాల్వాయి గేటు తెదేపా పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు ప్రాణహాని ఉందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని అందులో కోరాడు. శేషగిరి రావు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని వివరించాడు. కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నాడు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై శేషగిరిరావు మరో పిటిషన్ దాఖలు చేశాడు. ఆధారాలున్నా ఎమ్మెల్యే పేరు, అనుచరుల పేర్లు లేకుండా కేసు పెట్టారని.. గుర్తు తెలియని వ్యక్తులంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించారని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ అంశాలన్నీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని వివరించాడు.
తీవ్ర ఘటనలైనా బెయిల్ మంజూరు ఆందోళన కలిగిస్తోందని.. మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షాలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనని.. పోలీసులకు ఆదేశించాలంటూ బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును కోరారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. మే 13వ తేదీన జరిగిన పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేశారని, తనపై దాడి చేశారని బాధితుడు శేషగిరిరావు పేర్కొన్నారు. ఈవీఎం పగలకొట్టిన ఘటనలో ఈనెల 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ రోజు హింసకు పాల్పడిన ఎమ్మెల్యే.. కౌంటింగ్ రోజు కూడా పాల్పడే ప్రమాదం ఉందని బాధితుడు శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేసారు. ఈవీఎంను పగలకొట్టిన ఘటనలో పక్కా సాక్ష్యాలు ఉన్నా, సీసీటీవీ రికార్డు ఉన్నా... స్థానిక వీఆర్‌వో, ఎమ్మెల్యే పేరు, ఆయన అనుచరుల పేర్లు కూడా లేకుండా కేసు పెట్టారని సుప్రీంకోర్టుకు తెలిపారు.
హత్యాయత్నం, ఈవీఎం పగలకొట్టిన ఘటనలు రెండూ తీవ్రమైనవి అయినా... బెయిల్ మంజూరు చేయడం ఆందోళన కలిగిస్తున్నాయని బాధితుడు శేషగిరిరావు తన పిటిషన్లలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున... భద్రత కల్పించాలని, రెండు కేసుల్లో ఇచ్చిన అరెస్టు మినహాయింపును రద్దు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిన్నెల్లి స్వయంగా... కౌంటింగ్ దగ్గర ఉంటే మళ్ళీ హింస ప్రజ్వరిల్లే ప్రమాదం ఉందని శేషగిరిరావు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఒక భయానక వాతావరణం నెలకొని ఉందని, పిన్నెల్లి బయట ఉంటే.. అది ఇంకా పెరిగే ప్రమాదం ఉందని బాధితుడు శేషగిరిరావు అన్నారు. కౌంటింగ్ రోజు పిన్నెల్లి బయట ఉంటే ఆరోజు మాచర్ల అంతా హింసాత్మక ఘటనలతో అట్టుడికే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.