01-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
కాకినాడ, జూన్ 1: ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ గెలవాలని కోరుతూ తూర్పుగోదావరికి చెందిన ఓ యువతి మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరానికి చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి స్థానికంగా ఆర్‌ఎంపీ వైద్యం చేస్తుంటారు. పవన్ అంటే చాలా అభిమానం. పవన్‌కల్యాణ్ గెలవాలని తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నారు. అందులో భాగంగా మే 25న సుమారు 450 మెట్లు మోకాళ్లపై ఎక్కినట్లు శుక్రవారం ఆమె తెలిపారు.
పార్టీలతో తనకు సంబంధం లేదని, కేవలం పవన్‌పై ఉన్న అమితమైన అభిమానంతోనే మెట్లు ఎక్కినట్లు వివరించారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ఆయన అత్యధిక మెజార్టీతో కచ్చితంగా విజయం సాధిస్తారని దీమా వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, భవానీల అనుమతితో తిరుమల వెళ్లి మొక్కు తీర్చుకున్నట్లు వివరించారు.