01-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 1: రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీని అధికారికంగా మార్చిన క్రమంలో..ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్లుగా పోలీస్ శాఖలోనూ అధికారులు లోగోలను మారుస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు టీఎస్‌ఎస్పీగా ఉన్న లోగోను టీజీఎస్పీగా మార్చారు. టీజీఎస్పీ లోగో మార్పును ఆ విభాగం అధికారిక సోషల్ విూడియా ఖాతాలో పోస్ట్ చేశారు. టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ల లోగోలు సైతం టీజీఎస్పీ బెటాలియన్లుగా లోగోల్లో మార్పులు చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్లుగా త్వరలోనే పోలీస్ శాఖలోని మిగతా విభాగాల లోగోల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి.