ad1
ad1
Card image cap
Tags  

  01-06-2024       RJ

తిరోగమన దిశలో కాంగ్రెస్‌ పాలన: కెసిఆర్‌

తెలంగాణ

  • అభివృద్దిని పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం
  • తెలంగాణ ఆవిర్భావం కాంగ్రెస్‌ దయాభిక్ష కాదు
  • తొలి, మలి దశల్లో పోరాడి సాధించిన ఘన చరిత్ర
  • తెలంగాణ ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది
  • అందుకే విూరు నిర్వహించే ఉత్సవాల్లో మేము పాల్గొనం
  • సిఎం రేవంత్‌ రెడ్డికి మాజీ సిఎం కెసిఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 1: తెలంగాణ అభివృద్ది తిరోగమన దిశలో సాగిస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాల్లో పాల్గనరాదని నిర్ణయించినట్లు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భారాస అధినేత కేసీఆర్‌ 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రావాలని ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన బహిరంగ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితం.. అమరుల త్యాగాల పర్యవసానం. కానీ, కాంగ్రెస్‌ దయాభిక్షగా విూరు చేస్తున్న ప్రచారాన్ని నిరసిస్తున్నాను. 1969 నుంచి ఐదు దశాబ్దాలు, భిన్నదశలలో, భిన్నమార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్‌ రక్తసిక్తం చేసిందనేది విూరు దాచేస్తే దాగని సత్యం.

1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నది ఆదిగా.. కాంగ్రెస్‌ క్రూర చరిత్ర కొనసాగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజకరమైన సందర్భమే. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్‌ పాల్గొనడం సమంజసం కాదని భారాస, తెలంగాణ వాదుల అభిప్రాయంగా ఉందని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో బీఆర్‌ఎస్‌ పాల్గొనడం లేదని వెల్లడిరచారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్‌ పోకడలను నిరసిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా.. కాంగ్రెస్‌ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ భావ దారిదా్యన్ని నిరసిస్తున్నానని చెప్పారు. ఇకనైనా వైఖరిని మార్చుకుని సంక్షేమానికి పాటుపడాలని సూచించారు.

తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మంది ముక్కుపచ్చలారని యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్‌ దమననీతికి సాక్ష్యమే గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపమని కేసీఆర్‌ తెలిపారు. ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకోనివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్‌ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటల్లో నిలబడిపోయిందని అన్నారు. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్‌ పార్టీదే అని తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మక ప్రయత్నమే టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం అని చెప్పారు. పార్లమెంటరీ రాజకీయ పంథాలో, శాంతియుత మార్గంలో తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో మేలుమలుపు అని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిపైనా ఆ లేఖలో కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జై తెలంగాణ అనే నినాదాన్ని పలకలేదని.. తెలంగాణ ప్రజలకు ప్రాణ సమానమైన జై తెలంగాణ నినాదాన్ని నోటినిండా పలకలేని విూ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారని తెలిపారు.

ఇక ముందైనా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినదించే వివేకాన్ని తెలంగాణ సమాజం విూ నుంచి కోరుకుంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యి ఆరు నెలలవుతున్నా ఇప్పటివరకు తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించకుండా, శ్రద్దాంజలి ఘటించకుండా తెలంగాణ మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని అన్నారు. విూ ప్రవర్తనతో, విూ పార్టీ ప్రవర్తనతో కాంగ్రెస్‌ ఇప్పటికీ మారలేదు.. ఇక మారదు.. ఇక ముందు మారే అవకాశం లేదని స్పష్టమవుతుందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్టాన్న్రి తిరోగమన దిశగా తీసుకుపోతున్నది ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్‌ పాల్గొనడం సమంజసం కాదని.. బీఆర్‌ఎస్‌ పార్టీతో సహా ఉద్యమకారులు, తెలంగాణ వాదులు అభిప్రాయంగా ఉందని కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న విూ వికృత పోకడలను నిరసిస్తూ.. విూరు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్‌ఎస్‌ పాల్గొనడం లేదని తెలియజేయడానికి విచారిస్తున్నామని అన్నారు. ఇక ముందైనా ఇటువంటి వైఖరిని మానుకొని నిజమైన ప్రగతి కోసం, సంక్షేమం కోసం ప్రయత్నిస్తారని, ఎన్నికల వాగ్దానాలన్నీ త్వరగానే నెరవేరుస్తారనీ ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP