01-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూన్ 1: హైదరాబాద్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబుకు పార్టీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా రావటంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పట్ల సీనియర్ నేతలు దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కొల్లు రవీంద్ర, బోడె ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు..ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరి వెళ్లారు. పోలింగ్ ముగిసిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. దాదాపు మూడు వారాల తర్వాత తిరిగి అమరావతి వచ్చారు. అటు.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది.