01-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 1: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ కొనసాగనుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జంట నగరాల పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు. ఇదిలావుంటే అంతకుముందు కేసీఆర్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. శనివారం సాయంత్రం లక్డీకపూల్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
గన్‌పార్క్ దగ్గర తన కోసం వేచి చూస్తున్న పార్టీ నేతల వద్దకు బంజారాహిల్స్ నందీనగర్ నుంచి బయల్దేరి వెళ్లగా లక్డీకపూల్ ట్రాఫిక్‌లో ఆయన చిక్కుకున్నారు. దాదాపు అరగంటకుపైగా ఆయన ట్రాఫిక్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి బీఆర్‌ఎస్ సిద్ధమైంది. 10 ఏళ్లుగా అధికార పార్టీ హోదాలో వేడుకలు నిర్వహించగా.. రాష్టావ్రిర్భావం తరువాత తొలిసారి ప్రతిపక్ష హోదాలో కార్యక్రమం జరుపుతోంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో కేసీఆర్ పాల్గొననుండటంతో ఆ పార్టీ శ్రేణులు భారీగా గన్ పార్క్ వద్దకు చేరుకుంటున్నాయి.
ఇప్పటికే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ప్రజాప్రతినిధులు తదితర ముఖ్య నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. కేసీఆర్, బీఆర్‌ఎస్ నేతలు అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించనున్నారు. అనంతరం గన్ పార్క్ నుంచి సచివాలయం వద్ద ఉన్న అమరవీరుల స్మారక చిహ్నం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించ నున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి వస్తుండానే కేసీఆర్ లక్డీకపూల్ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.