01-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 1: నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ స్లాబ్ కుప్పకూలిన ఘటన రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. జూన్ 1వ తేదీ శనివారం పుప్పాల్ గూడలోని అల్కాపూర్ రోడ్డు నెంబర్ 14లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరకీ ఎటువంటీ గాయాలు కకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. బిల్డర్స్ నాసిరకమైన మెటిరియల్ వాడి స్లాబ్ వేస్తుండడంతో జరిగనట్లు తెలుస్తోంది.
కుప్పకూలిన స్లాబ్ విడియోలు చిత్రికరించడానికి వెళ్లిన విూడియాపై యాజమాన్యం దాడికి యత్నించింది. ఇక్కడ ఏవిూ కాలేదంటూ... ఇరువైపుల రోడ్డును అధికారులు మూసివేశారు. సేప్టీ ప్రికాషన్స్ పాటించకుండా కార్మికుల ప్రాణాలతో నిర్మాణ సంస్థలు చెలగాటం ఆడుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
చెప్పారు.