02-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 2: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పని చేయాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మనకు మనమే కాదని.. ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పుకోవాలని అన్నారు. కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయన.. కొన్ని క్షణాలు బాధగా ఉంటాయని చెప్పారు. అవి ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది అని.. ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేమని అన్నారు.
25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది అని కేసీఆర్ అన్నారు. ’బీఆర్‌ఎస్ మహావృక్షం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కొంత నైరాశ్యంలో ఉన్నాం. ఆ తర్వాత నేను బస్సు యాత్ర మొదలు పెట్టగానే మళ్లీ అదే గర్జన కనిపించింది. మోకాళ్ల ఎత్తు కూడా లేనోళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్ ఖతం అయితది అంటున్నారు. వందకు వంద శాతం మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుంది. రైతు బంధు ఊరికనే ఇవ్వలేదు. స్థిరీకరణ కోసం ఇచ్చాం. చేప పిల్లలు, గొర్రెలు ఇస్తుంటే కూడా అవమానించారు. బీఆర్‌ఎస్ హయాంలో గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశాం. ఎన్ని చేసినా కొంత విష గాలి వస్తుంది. ఆ గాలికి జనం కొంత అటు వైపు మొగ్గుచూపారు. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పని చేయాలి. కరెంట్ విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరం.
రైతులకు విత్తనాలు గత పదేళ్లలో సక్రమంగా ఇచ్చాం. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్ కు 105 అసెంబ్లీ సీట్లు వస్తాయ్. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గెలిచాం. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి విజయం ఖరారైంది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు. నూతన ఉద్యమ పంధా అవివాహకరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల పరిరక్షణెళి ధ్యేయంగా పనిచేద్దాం.’ అని కేసీఆర్ బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ’1999లో అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించిన బాధ ఊహించుకుంటే ఇప్పుడు దుఃఖం వచ్చే పరిస్థితి ఉంది. యావత్ తెలంగాణ కరువులు, వలసలు, కరెంట్ కోతలు, ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులకు నెలవుగా ఉండేది.
సరైన వ్యూహం లేకపోవడం వల్లే 1969 ఉద్యమం విఫలమైంది. 2001లో కాదు. 1999లోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒళ్లు పులకరిస్తుంది.’ అని కెసిఆర్ పేర్కొన్నారు. మన భాష మాట్లాడుతుంటే నవ్వుతారో ఏమో అనుకునే స్థాయి ఆనాడు ఉండేదని కేసీఆర్ అన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్ని పలకవద్దని అప్పటి స్పీకర్ అసెంబ్లీలో అన్నారని.. ఇక్కడి భాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందర హేళన చేశారని గుర్తు చేశారు. ’వలసలు పోతుంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు కనీసం ఆపలేదు. స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ టార్గెట్ అయితే చేస్తా అని వచ్చా. మళ్లీ ఉద్యమం నేను మొదలుపెట్టాను. అనేక పోరాటాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. పాతాళంలో ఉన్న తెలంగాణను పైకి తీసుకొచ్చాం. పాటతోనే మొత్తం తెలంగాణ చరిత్ర తెలిసేది. చరణంలోనే మొత్తం తెలవాలి. అందుకే తెలంగాణ పాటతో పుట్టింది.’ అని అన్నారు.
తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్‌ను ఆజన్మ తెలంగాణవాదిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీర్తించారు. జయశంకర్ సార్ తెలంగాణ గురించి చేసిన పోరాటాలను గుర్తుచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ రోజుల్లో తెలంగాణ గురించి మాట్లాడుడే కష్టంగా ఉండెనని, నాటి శాసనసభ స్పీకర్ యనమల రామకృష్ణుడు తెలంగాణ అనే పదం ఉపయోగించవద్దని చెప్పారని, వెనుకబడిన ప్రాంతం అనాలని శాసనసభముఖంగా వ్యాఖ్యానించారని కేసీఆర్ గుర్తుచేశారు. జయశంకర్ సార్ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పారు.’ఆనాడు నా సలహాదారుగా, సహచరుడిగా రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి మాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్. అయన అన్ని సందర్భాల్లో నాతోపాటు ఉండేవారు. ఆయన చాలా గొప్పవారు. కఠోరమైన సిద్దాంతాలను నమ్మే పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చిందంటే దాన్ని పక్కనవెట్టి కొన్ని పనులు చేస్తారు.
ప్రొఫెసర్ జయశంకర్ గారి గొప్పతనం ఏమిటంటే ఆయన ఆజన్మ తెలంగాణ వాది. 14, 15 ఏళ్లు నేను ఆయనతో కలిసి పనిచేసిన. ఆనేక సందర్భాల్లో ఆయన తెలంగాణ వ్యథల గురించి చెప్పేవారు. ఈ సందర్భంలో ఆయనను స్మరించుకోకుండా నేను ఉండలేను. అలాంటి మనుషులు ప్రపంచంలో అరుదుగా ఉంటారు’ అని కేసీఆర్ అన్నారు. విూ ప్రస్థానం ఎలా మొదలైంది సార్ అని జయశంకర్ సార్‌ను అడిగితే.. ఆంధ్రావాళ్లు చేసిన హేళనల గురించి చెప్పారు. నాడు హైదరాబాద్ రాష్ట్రంలో తన బాల్యంలో వరంగల్‌లోని మర్కజి స్కూల్‌లో జరిగిన సంఘటన గురించి చెప్పారు. నాడు ఆ స్కూల్‌లో ఆయన విద్యార్థి. ఆ పాఠశాలకు ఆంధ్రా ప్రాంతం నుంచి అయ్యదేవర కాళేశ్వర్‌రావు లాంటి వాళ్లు వచ్చి తెలంగాణను ఎగతాళి చేసేవారు. తెలంగాణ వాళ్లను ఆంధ్రాతో విలీనానికి మానసికంగా సిద్ధం చేసే ప్రయత్నాలు జరిగాయన్నారు.
అలాంటి ప్రయత్నంలో భాగంగానే ఒకసారి అయ్యదేవర కాళేశ్వర్‌రావు మర్కజి స్కూల్‌కు వచ్చి తెలంగాణ భాష గురించి అవమానకరంగా మాట్లాడారని, దాంతో తోటి విద్యార్థులతో కలిసి తాము జై తెలంగాణ నినాదాలు చేశామని, అతనిపై రాళ్లు విసిరామని చెప్పారు. అప్పుడు తమపై లాఠీచార్జి చేశారని తెలిపారు. అదే తెలంగాణ ప్రాంతంలో జరిగిన తొలి లాఠీ చార్జి’ అని కేసీఆర్ చెప్పారు. ఆ సంఘటనతో ఆయన తెలంగాణ అస్థిత్వం కోల్పోవద్దని, తెలంగాణ తెలంగాణగనే ఉండాలని నిర్ణయించుకుని పోరాట పంథా ఎంచుకున్నారు. నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి పిలిచి బెదిరించినా జయశంకర్ సార్ బెదరలేదు. పోరాట పంథాను వీడలేదు. అలా అనేక సందర్భాల్లో ఆయన బెదిరింపులను ఎదుర్కొన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని అణచడం కోసం నాటి ప్రభుత్వాలు చేసిన ఘోరాలు అన్నింటికి ఆయన సాక్షి.
1969 ఉద్యమంలో కూడా చాలా మంది పెద్దలు పోరాటం చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన విజయసింహారెడ్డి తండ్రి కృష్ణారెడ్డి పోరాటంలో అగ్రభాగాన ఉండేవారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి 1969లో ఇక్కడి పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజినీరింగ్ విద్యార్థిగా ఉంటూ అనేకసార్లు లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లారు. ఇలా అనేక మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిరడ్రు. వాళ్లందరికి మనం తలెత్తి మొక్కాల్సిందే’ అని కేసీఆర్ అన్నారు.