02-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ వచ్చి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదు. అందెశ్రీ రాసిన ’జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంగా ఉండాలని అనుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటిస్తున్నాం. జాతి చరిత్రకు అద్దంపట్టేదే రాష్ట్ర చిహ్నం. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది అందులోనే. సూచనలకు అనుగుణంగా నూతన చిహ్నాన్ని రూపొందిస్తున్నాం. ప్రజల ఆకాంక్షల మేరకు టీఎస్‌ను.. టీజీగా మార్చాం. సగటు గ్రావిూణ మహిళా రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలి‘ అని రేవంత్ అన్నారు. తెలంగాణను 3 జోన్లుగా విభజన చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాంతం వరకు సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రావిూణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మూడు ప్రాంతాలకూ త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని తెలిపారు. త్వరితగతిన రీజినల్ రింగు రోడ్డు పూర్తిచేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బానిస సంకెళ్లను తెంచి ప్రజాపాలనను అందిస్తున్నామని సిఎం తెలిపారు. దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చామని చెప్పారు.ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ చిహ్నం ఆవిష్కరిస్తామన్నారు. మూసీ సుందరీకరణ పథకం ద్వారా వెయ్యి కోట్లతో పరివాహక ప్రాంతం ఉపాధికల్పన జోన్ గా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆర్థిక క్రమ శిక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే అభివృద్ధిలో రాజీలేని కృషి చేస్తామని.. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపేలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.