ad1
ad1
Card image cap
Tags  

  02-06-2024       RJ

వైకాపా అల్లర్లు సృష్టించే అవకాశం ఉంది.. ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్

  • ఎపిలో ఎన్‌డిఎ కూటమిదే విజయం
  • ఎగ్జిట్‌ పోల్స్‌కన్నా ముందే గెలుపు ఖాయం
  • కూటమి నేతల టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు

అమరావతి, జూన్ 2: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం తథ్యమని కూటమి అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జరిగిన ఎన్నికలకు ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అవసరం లేదని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కూటమి తరఫున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులతో అగ్రనేతలు చంద్రబాబు, అరుణ్‌ సింగ్‌, పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్‌ జూమ్‌ విూటింగ్‌ నిర్వహించారు. అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికల అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్‌ అరుణ్‌ సింగ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఎన్నికల్లో కూటమికి 53శాతం, వైసీపీకి 41శాతం ఓట్లు పోలయ్యాయని తరుణ్‌ సింగ్‌ చెప్పారు. ఈ మేరకు తమ వద్ద స్పష్టమైన లెక్కలు ఉన్నాయన్నారు. కౌంటింగ్‌ రోజు, తర్వాత వైసీపీ మూకలు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తు న్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని పురందేశ్వరి వారికి సూచించారు. కౌంటింగ్‌లో ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, పోలింగ్‌ రోజు ఇచ్చిన ఫార్మ్‌ 17`అను ఏజెంట్లు అందరూ కౌంటింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. మూడు పక్షాల ఏజెంట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని, పోటీ చేసిన అభ్యర్థులు కేంద్రాలకు తప్పనిసరిగా వెళ్లాలని ఆదేశించారు.

ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించే అంశంలో అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు చంద్రబాబు సూచించారు. ఇటీవల పోస్టల్‌ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అందరూ జాగ్రత్తగా చూడాలన్నారు. అందరూ రాజ్యాంగ, చట్టబద్ధంగా వ్యవహరించాలని ప్రత్యర్థులు రెచ్చగొట్టినా సమన్వయంతో ఉండాలన్నారు. కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని.. ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని చంద్రబాబు పేర్కొన్నారు. కౌంటింగ్‌ రోజున అల్లర్లకు పాల్పడేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోందని ఆయన ఆరోపించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ వైసీపీ కొర్రీలు వేయాలని చూసిందన్నారు.

డిక్లరేషన్‌ ఫాం తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు రావాలన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని ఇప్పటికే అధికార పార్టీ మొదలు పెట్టిందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారన్నారు. కౌంటింగ్‌ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉందన్నారు. అందువల్ల కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లు, చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లు కౌంటింగ్‌ కేంద్రానికి సమయానికి చేరుకోవాలన్నారు. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు పని చేయాలన్నారు.

ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూముల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యహరించాలని చంద్రబాబు సూచించారు. ప్రతి అభ్యర్థి లీగల్‌ టీంను అందుబాటులో ఉంచుకోవాలని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశ్యంతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేశారన్నారు. ఏపీలో ఎన్డీయేకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని బీజేపీ జనరల్‌ సెక్రటరీ అరుణ్‌ సింగ్‌ అన్నారు. రాష్ట్రంలోనూ 53 శాతం ఓట్లతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. లెక్కింపులో అనుమానాలు ఉంటే రీకౌంటింగ్‌ అడగాలని బీజేపీ ఏపీ చీఫ్‌ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ .. కౌంటింగ్‌ సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందన్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP