02-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాజ్‌భవన్ వద్ద జాతీయ పతాకాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్ది వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవినీతి నిర్మూలనే మనందరి లక్ష్యమని గవర్నర్ చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ శాంతికుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జెండా ఆవిష్కరించారు. గాంధీ విగ్రహం, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళి అర్పించారు. గాంధీభవన్‌లోనూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. పిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.