02-06-2024 RJ
సినీ స్క్రీన్
‘కేజీఎఫ్’ మూవీలో రమీకా సేన్ పాత్రలో కనిపించిన బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్‌పై దాడి జరిగింది. శనివారం రాత్రి కొంతమంది ముస్లిం మహిళలు, ఆమెపై దాడి చేశారు. అతివేగంగా కారు నడుపుతూ ఓ ముస్లిం మహిళ తీవ్రంగా గాయపడడానికి కారణం కావడం వల్లే ఈ దాడి జరిగినట్టు సమాచారం. మీడియా కథనాల ప్రకారం శనివారం రాత్రి రవీనా టాండన్ ప్రయాణిస్తున్న కారు, అతి వేగంగా వచ్చి ముంబైలోని కార్టర్ రోడ్డు సమీయంలో ముగ్గురు మహిళలని ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్‌తో బాధిత మహిళలు గొడవపెట్టుకున్నారు. కారు డ్రైవర్ రాష్ డ్రైవింగ్‌ని సపోర్ట్ చేసిన రవీనా టాండన్, కారు దిగి ఆ మహిళలతో వాగ్వాదానికి దిగింది.
ఆ సమయంలో ఫుల్లుగా తాగి ఉన్న రవీనా టాండన్ తమను బూతులు తిట్టిందని ఆ ముస్లిం మహిళలు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. రవీనా టాండన్ కారు ఢీకొనడంతో గాయపడిన వారిలో ఓ ముసలావిడ కూడా ఉందని సమాచారం. కొద్దిసేపటికి ఆ ముగ్గురు మహిళలు కలిసి, రవీనా టాండన్‌పై ఎదురుదాడికి దిగారు. దీంతో రవీనా, ‘ప్లీజ్ నన్ను కొట్టొద్దు’ అంటూ వేడుకోవడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రవీనా టాండన్ కారు ఢీనడంతో ఓ మహిళకు ముక్కు దగ్గర తీవ్ర గాయమై రక్తం కూడా కారింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలుగులో ఆడపాదడపా సినిమాల్లో నటించిన రవీనా టాండన్, హిందీలో మాత్రం చాలా సినిమాల్లో నటించింది.
తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రథ సారథి’ సినిమాలో తొలిసారి నటించింది రవీనా టాండన్. ఆ తర్వాత బాలకృష్ణ, రమ్యకృష్ణలతో కలిసి ‘బంగారు బుల్లోడు’ సినిమా చేసింది. నాగార్జునతో కలిసి ‘ఆకాశవీధిలో’ సినిమాలో నటించిన రవీనా, మోహన్‌బాబుతో ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’ సినిమాలో నటించిన రవీనా టాండన్, 2024లో నాలుగు హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..