02-06-2024 RJ
సినీ స్క్రీన్
డైరెక్టర్ శంకర్, హీరో కమల్ హాసన్, కాంబినేషన్ లో భారీ బడ్జెట్ చిత్రంగా ‘భారతీయుడు 2’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. శనివారం నాడు చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ఈ రోజే సినిమా ఫైనల్ మిక్సింగ్ ను విన్నాను. అనిరుధ్ మ్యాజిక్ ను అద్భుతంగా చేశాడు. సంతో సినిమాకు సరికొత్త ఎనర్జీ వచ్చింది. ప్రేక్షకులకు కూడా సినిమా చూశాక అదే ఎనర్జీ వస్తుందని తెలిపారు. ఇండియన్ టైంలోనే కమల్ హాసన్ సీక్వెల్ తీద్దామని అడిగారని., కాకపోతే అప్పుడు నా వద్ద సరైన కథ లేదని చెప్పినట్లు తెలిపారు.
చాలా ఏళ్లకు పేపర్స్ లో లంచం వల్ల జరిగే ఘోరాలు, అన్యాయాలు చూసి కథ ఇలా రాద్దామా..? అలా రాద్దామా..? అని అనుకున్నానని.. అయితే అప్పుడు నేను, కమల్ హాసన్ వేర్వేరు ప్రాజెక్టుల్లో ఉండటంతో కుదర్లేదని తెలిపాడు. రోబో 2.O తరువాత ఈ కథ రాసుకున్నానని., అలా ఇండియన్ 2 మొదలైనాట్లు తెలిపారు. మొదటి రోజు షూటింగ్‌లో ఇండియన్ 2 గెటప్‌లో కమల్ హాసన్ చూసి అంతా షాక్ అయ్యామని ఆయన.. 28 ఏళ్ల క్రితం ఎలా అనిపించిందో.. అప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగిందని తెలిపాడు. ఇండియన్ తాత మంచి వాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. ఇలాంటి పాత్రను చేయడం మామూలు విషయం కాదని తెలిపారు.
ఇక కమలాసన్ 360 డిగ్రీ కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నటించే సత్తా ఉన్న నటుడని, 70 రోజుల పాటు మేకప్ తో ఆయన నటించారని చెప్పుకొచ్చారు. ఆయనలాంటి యాక్టర్ ఈ ప్రపంచంలోనే లేరని శంకర్ తెలిపారు. ఆయనతో ఇండియన్ 2, ఇండియన్ 3 చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజానికి ఈ ఇండియన్ 2 వేరే నిర్మాతతో సినిమా చేయాలి. అయితే లైకా నుంచి సుభాస్కరన్ ఫోన్ చేసి ‘నేను నిర్మిస్తాను.. నాకు ఇండియన్ సినిమా అంటే చాలా ఇష్టం. నేనే నిర్మిస్తాను’ అన్నట్లు తెలిపారు. ఇక చివరగా ఇండియన్ ఎంత పెద్ద హిట్ అయిందో ఇండియన్ 2 అంత కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నట్లు ఆయన అన్నారు.