02-06-2024 RJ
సినీ స్క్రీన్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ గా వున్నారు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న లేటెస్ట్ ‘కంగువ’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా, వంశికృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే సూర్య నటిస్తున్న మరో మూవీ ‘సూర్య 44'.. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ జిగర్ తండా డబల్ ఎక్స్ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నారు.ఈ సినిమాలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కు సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.తాజాగా పూజ హెగ్డేకు వెల్కమ్ చెబుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం.