02-06-2024 RJ
సినీ స్క్రీన్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం ధనుష్ తెలుగులో స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ధనుష్ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే హీరో ధనుష్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇండియన్ మ్యూజిక్ మాస్ట్రో అయిన ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ మూవీని గతంలో ధనుష్ తో ‘కెప్టెన్ మిల్లర్’ వంటి యాక్షన్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది గ్రాండ్ గా మొదలు పెట్టి వచ్చే ఏడాది థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే నేడు ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఇండియన్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇళయరాజా తన ట్రూప్‌తో కలిసి పాట పాడుతున్నట్లుగా మేకర్స్ ఈ పోస్టర్‌లో చూపించారు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.త్వరలోనే ఈ బయోపిక్ గురించి మరిన్ని వివరాలు వెల్లడిరచనున్నట్లు మేకర్స్ తెలిపారు.