ad1
ad1
Card image cap
Tags  

  03-06-2024       RJ

దేశంలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

తెలంగాణ

  • పలుప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు
  • తెలుగు రాష్ట్రాల్లో కురవనున్న వానలు

హైదరాబాద్‌, జూన్‌ 3: దేశంలోకి నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించడంతోపాటు  చాలా వేగంగా దేశం నలువైపులా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావం అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవడంతోపాటు.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిరది. గత నెల 30న కేరళను తాకిన రుతుపవనాలు... కర్ణాటక విూదుగా రాయలసీమలోకి ప్రవేశించాయి. ఈనెల 6న రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌ తోపాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. కేరళలోకి ముందగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. కర్ణాటక విూదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. చాలా రోజుల తర్వాత జూన్‌ 1, 2 తేదీల్లోనే రుతుపనాలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభించడానికి రుతుపవనాలు రాక ఎంతో ఆవశ్యకం. రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశించిన రుతుపవనాలు క్రమంగా  రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలోనూ పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. ఈనెల 6న రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోకి రుతుపవనాల రాకతో తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆదివారం మొత్తం మబ్బులు పట్టి చిరుజల్లులు కురిశాయి. హైదారాబాద్‌ లో అయితే భారీ వర్షమే కురిసింది. ల్గªరుతి రుతుపవనాల రాకను పురస్కరించుకుని తెలంగాణ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

అసిఫాబాద్‌ జిల్లా వాంకిడిలో ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో పిడుగుపడి చెట్లు నేలకూలాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడిరచింది. మూడురోజులపాటు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉపరితల ఆవర్తన ప్రభావంతో నల్గొండ, ఖమ్మం,సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డితోపాటు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణశాఖ వెల్లడిరచింది. యాద్రాద్రి భువనగిరి జిల్లా వీరవెల్లిలో ఈదురుగాలులకు పశువుల కొట్టం రేకులు ఎగిరిపోయాయి.

బీఎస్‌ తిమ్మాపురంలో ఫొటో స్టూడియో రేకులు పడిపోయి కంప్యూటర్లు, ప్రింటర్‌, ఫర్నీచర్‌ ధ్వంసమయ్యాయి. బాచుప్పలో కోళ్లఫాం కూలిపోయింది. మెదక్‌ జిల్లా వల్లంపట్లలో పిడుగు పాటుతో పాడిగేదె మృతిచెందింది. అలాగే అసిఫాబాద్‌ జిల్లాలోని గుండి పెద్దవాగులో వంతెన కొట్టుకుపోయింది. జన్నారంలో ఇంటి కప్పు లేచిపోగా...కిష్టంపేటలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. అలాగే పలుచోట్ల మేకలు పిడుగుపాటుకు చనిపోయాయి. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. ఆదివారం కేరళలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించడంతోపాటు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు, కర్ణాటక, ఏపీలోకి ప్రవేశించాయి.

రతుపవనాల రాకతోనే తొలకరి జల్లులు కురిసి...రైతులు సాగుకు సిద్ధమవుతుంటారు. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు దకిణ భారతదేంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు కారణమవుతాయి. వీటి రాకతో సకాలంలో వర్షాలు కురవడంతోపాటు.... నదులు, రిజర్వాయర్లు నిండిపోతాయి. అందుకే రైతులు నైరుతి రుతుపవనాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. సకాలంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో  ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తన దుకాణాల వద్ద రద్దీ భారీగా పెరిగింది.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP