03-06-2024 RJ
సినీ స్క్రీన్
కల్కి’ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. అందులో భాగంగానే సినీ సెలబ్రిటీల పిల్లలకు గిప్ట్‌లు పంపుతోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ’కల్కి 2898 ఏడీ’ ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల బుజ్జి వెహికల్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన టీమ్.. దీంతోనే ప్రమోషన్స్‌ను షురూ చేసింది. సినీ సెలబ్రిటీల పిల్లలకు ’కల్కి’ టీమ్ గిప్ట్‌లు అందుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ కుమార్తె క్లీంకారకు మూవీ యూనిట్ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి `భైరవ స్టికర్స్, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్ ఉన్నాయి.
క్లీంకార వాటితో ఆడుకుంటున్న ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాలో షేర్ చేశారు. కల్కి టీమ్‌కు థ్యాంక్స్, ’ఆల్ ది బెస్ట్’ చెప్పారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా వీటిని పంపనున్నట్లు తెలుస్తోంది. ప్రచారంలో భాగంగానే తాజాగా ’బుజ్జి అండ్ భైరవ’ పేరుతో యానిమేటెడ్ సిరీస్ తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా.. సీనియర్ హీరో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.