03-06-2024 RJ
తెలంగాణ
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 477 కిలోల గంజాయిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. మామిడి కాయల బస్తాల్లో దాచి తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.19 కోట్లు ఉంటుందని తెలిపారు. గంజాయిని ఆంధ్రాలోని డొంకరాయి నుంచి తెలంగాణలోని జహీరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడిరచారు. గంజాయి తరలిస్తున్న చెరుకుపల్లి శ్రీకాంత్, అర్జున్, సునీల్ కుమార్, నాగరాజు, సృజన్‌లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఏపీ నుంచి తెలంగాణలోని జహీరాబాద్‌కు ఓ ట్రాలీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 1.19 కోట్లు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.