03-06-2024 RJ
తెలంగాణ
ములుగు, జూన్ 3: ములుగు జిల్లా వాజేడు మండలంలో మందు పాతర పేలి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందు పాత్ర పేలి వ్యక్తి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో చోటుచేసుకుంది. వాజేడు మండలంలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన ఇల్లెందుల ఏసు(55) సోమవారం వంట చేరుకు నిమిత్తం కొంగాల అటవీ ప్రాంతంలోని గుట్టపైకి ఎక్కుతున్న క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందు పాతరపై కాలు వేయటంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. దీంతో యేసు గాల్లోకి లేచి కిందపడి తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.
ఏసుతో పాటు అతని కొడుకు రమేష్ మరో ముగ్గురు సైతం వంట చెరుకు కోసం వెళ్లారు. మిగిలిన నలుగురుకి ఎటువంటి గాయాలు కాలేదు గుట్ట దిగి కిందకి వచ్చి స్థానికులకు సమాచారం అందించడంతో స్థానికులు కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా పోలీసులు సంఘటన స్థలానికి ఇప్పటివరకు చేరుకోలేదు మృత మృతదేహాన్ని కిందకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, స్థానికులు జంకుతున్నారు .మందు పాత్రలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.