03-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 3: తెదేపా అధినేత చంద్రబాబు రాకతో మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో సందడి నెలకొంది. పోలింగ్ ముగిశాక తొలిసారి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు నేతలు ఘన స్వాగతం పలికారు. ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కసారిగా సీఎం.. సీఎం నినాదాలతో ఎన్టీఆర్ భవన్ మార్మోగిపోయింది. సంబరాలు రేపు చేసుకుందామని.. శక్తిని అప్పుడే ఖర్చు చేసుకోవద్దంటూ శ్రేణులతో చంద్రబాబు చమత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ బ్యాకాఫీస్‌లో పనిచేసిన నేతలను చంద్రబాబు అభినందించారు. సైకిల్ దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్‌లో తాను సైకిల్ తొక్కుతున్న ఫొటోను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. తెదేపా గుర్తు కూడా సైకిల్ కావడంతో.. సైక్లింగ్ వ్యక్తులకు, సమాజానికి మంచిదని అన్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పోలీసులు గౌరవ వందనం పలికారు. ’జై చంద్రబాబు.. సీఎం చంద్రబాబు’ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ కేంద్ర కార్యాలయం సందడి వాతావరణంగా మారింది. ఈ సందర్భంగా పార్టీ బ్యాకాఫీస్‌లో పనిచేసిన నేతలను చంద్రబాబు అభినందించారు. ఎన్నికల్లో తన పర్యటనలు కోఆర్డినేట్ చేసిన బృంద సభ్యులను అభినందించారు. ప్రచారంలో భాగంగా రోజుకు 3 నుంచి 5 కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనేలా ఈ బృందం సమన్వయం చేసింది. బాగా కష్టపడి పని చేశారంటూ బృంద సభ్యులను తన నివాసంలో చంద్రబాబు అభినందించారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌లో తాను సైకిల్ తొక్కుతున్న ఫొటోను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ గుర్తు కూడా సైకిల్ కావడంతో.. సైక్లింగ్ వ్యక్తులకు, సమాజానికి మంచిదని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో నేతలు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నేతలకు పలు సూచనలు, సలహాలు చంద్రబాబు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులతో పాటు ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్ధేశర చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ చేస్తున్న రాద్దాతం అంతా ఇంతా కాదు. అ విషయంలో టీడీపీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది.