03-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 3: సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. సోషల్ విూడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు. కౌంటింగ్ తర్వాత విూ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ విూడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారన్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హరీష్ కుమార్ గెప్తా హెచ్చరించారు. వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని డీజీపీ హెచ్చరించారు. రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, పీడీ యాక్ట్ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ హెచ్చరించారు.
ఉద్రిక్తత సృష్టించే పోస్టులు ఎవరి ప్రోద్బలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామని ఏపీ డీజీపీ తెలిపారు. వారిని కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆ పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధమన్నారు. గ్రూప్ అడ్మిన్‌లు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించ కూడదన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని డిజిపి కార్యాలయంలో ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిజిపి హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. అట్టి పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామనీ, అట్టివారిని కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు.