03-06-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, జూన్ 3: లోకసభ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఖమ్మం పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే, కౌంటింగ్ పరిశీలకులు ప్రేదిమాన్ కృషన్ భట్ లతో కలిసి పరిశీలించారు. శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ హాళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవిఎం యంత్రాల కౌంటింగ్, 7 అసెంబ్లీ సెగ్మెంట్ లలోని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ భారత ఎన్నికల కవిూషన్ నిర్దేశిరచిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశామని, ప్రతి కౌంటింగ్ హాల్ లో 14 కౌంటింగ్ టేబుల్స్, ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి 18 టేబుళ్లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కౌంటింగ్ విధుల నిర్వహణకు ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద ఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో పరిశీలకులు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని ఆయన తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో 20 రౌండ్లు, పాలేరు, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లు, మధిర లో 19, వైరాలో 18, కొత్తగూడెం లో 18, అశ్వారావుపేట సెగ్మెంట్ లో 13, పోస్టల్ బ్యాలెట్ ఇటిపిబిఎస్ లతో కలిపి 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానున్నట్లు ఆయన అన్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు అన్ని కౌంటింగ్ హాళ్లలో కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆª`లనైన్ లో నమోదు చేసేందుకు అవసరమైన సిబ్బందిని నియమించామని అన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించేందుకు భారత ఎన్నికల కవిూషన్ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ సెంటర్ వద్ద విూడియా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసి కౌంటింగ్ కు సర్వం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా సహాయ రిటర్నింగ్ అధికారులు ఆదర్శ్ సురభి, బి. సత్యప్రసాద్, వేణుగోపాల్, ఎం. రాజేశ్వరి, జి. గణెళిష్, ఎల్. రాజేందర్, మధు, తహసిల్దార్ లు, అధికారులు, తదితరులు ఉన్నారు.