ad1
ad1
Card image cap
Tags  

  04-06-2024       RJ

ఏపిలో వార్‌ వన్‌సైడ్‌.. చంద్రబాబుకు పార్టీ శ్రేణుల ఘనస్వాగతం

ఆంధ్రప్రదేశ్

  • భారీ విజయం దిశగా టిడిపి కూటమి
  • జగన్‌ మినహా మంత్రులంతా ఇంటిబాట
  • రాయలసీమలోనూ టిడిపిదే హవా
  • రాజీనామాకు సిద్దమైన జగన్‌

అమరావతి, జూన్‌ 4: ఏపీలో టిడిపి కూటమి విజయం దాదాపుగా ఖాయమైంది. ఎగ్జిట్‌ పోల్స్‌ను మించి ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు చాణక్యం ఫలించింది. ఇప్పుడున్న ట్రెండ్స్‌ని బట్టి చూస్తే.. 150 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. సీఎం జగన్‌ తప్ప మిగతా మంత్రులంతా ఓటమిదిశగా ఉన్నారు. పలు జిల్లాల్లో కూటమి క్లీన్‌ స్వీప్‌ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ అదే జోరు కనబరుస్తోంది. మొత్తం 25కు గానూ.. 22 చోట్ల కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయం దిశగా పయనిస్తోంది. దీంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగుదేశంపార్టీ మొత్తం 144 సీట్లలో పోటీ చేయగా అందులో 134 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఏపీలో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోన్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ కార్యాలయం వద్ద సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఏపీలో ఫలితాలు ఊహించేందుకు వీలు లేకుండా పోయింది. ఒక్క సీఎం జగన్‌ మినహా మిగిలిన వారందరూ వెనుకంజలో ఉన్నారు. ఏపీలో ఫలితాలు ఊహించేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన జగన్‌ రాజీనామాకు సిద్దపడ్డారు.  మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో ఉన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం వెనుకంజంలో ఉన్నారు. రాజకీయంగా తలపండిన సీనియర్‌ నాయకులు, హేమాహేవిూలందరూ వెనుకంజలో ఉన్నారు.

పిన్నేపి విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాల్‌, దాడిశెట్టి రాజా, తానేటి వనిత వీరందరూ వెనుకంజలో ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ, జమ్మలమడుగు తెదేపా అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, తాడికొండలో తెదేపా అభ్యర్థి తెనాలి శ్రవణ్‌కుమార్‌, తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌, పాలకొల్లులో తెదేపా అభ్యర్థి నిమ్మల రామానాయుడు, సంతనూతలపాడు తెదేపా అభ్యర్థి విజయ్‌కుమార్‌, గురజాలలో ఆధిక్యంలో తెదేపా అభ్యర్థి యరపతినేని కొనసాగుతున్నారు. కళా వెంకట్రావు కూడా ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్‌ కేంద్రాల నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ వెళ్లిపోయారు. ఫలితాల తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ఆర్‌సీపీకి అత్యంత ఘోరమైన ఓటమి ఖాయమయింది.

ఉదయమే కౌంటింగ్‌  సెంటర్లకు వచ్చిన అభ్యర్థులు మొదటి రెండు, మూడు రౌండ్ల తర్వాత పరిస్థితి చూసి వెళ్లిపోయారు. మామూలుగా చివరి వరకూ ఉండి ఫలితం చూసి.. డిక్లరేషన్‌ ఫాం తీసుకుని వెళ్లాలి. కానీ ఏ రౌండ్‌లోనూ కనీసం గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో..ఫలితం అర్థమై  ఇంటిబాట పట్టారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు కొడాలి నాని, వల్లభనేని వంశీ నాలుగు రౌండ్ల తర్వాత గెలిచే అవకాశం లేకపోవడంతో ఇంటిబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి  ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ ఎంత భారీ విజయాన్ని సాధించిందో.. ఈసారి అంత కంటే ఎక్కువగా ఘోర పరాజయం పాయింది. ఎక్కడా కూడా గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అభ్యర్థులు డీలా పడిపోయారు.

మూడు రౌండ్ల తర్వాత వరుసగా కౌంటింగ్‌ సెంటర్ల నుంచి వెళ్లిపోయారు. కౌంటింగ్‌ ఏజెంట్లు కూడా తర్వాత వెళ్లిపోవడంతో.. వైసీపీ తరపున ఓట్ల లెక్కింపును కూడా పర్యవేక్షించే వారు లేకపోయారు.  ఎగ్జిట్‌ పోల్స్‌ వ్యతిరేకంగా వచ్చినా లోకల్‌ ఎగ్జిట్‌ పోల్స్‌.. బాగా వచ్చాయని పోటీ ఇచ్చే స్థాయిలో ఉంటామని వైసీపీ నేతలు అనుకున్నారు. అందుకే కాస్త గట్టిగా పోరాడి అయినా ఓట్లను తమకు అనుకూలంగా చేసుకునేందుకు ప్రయత్నించాలని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు కౌంటింగ్‌ ఏజెంట్లకు సలహా ఇచ్చారు. అయితే మొదటి రౌండ్లలోనే ఫలితం తేలిపోవడంతో.. వైసీపీ నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయింది.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP