ad1
ad1
Card image cap
Tags  

  04-06-2024       RJ

పరాభవంతో.. వైసీపీ మంత్రులంతా ఓటమి దిశగా పయనం

ఆంధ్రప్రదేశ్

అమరావతి, జూన్‌ 4: ఏపీలో వన్‌సైడెడ్‌గా కూటమి అభ్యర్ధులు విజయం దిశగా దూసుకుపోతున్న వేళ వైసిపి శ్రేణుల్లో నిసతేజం ఆవరించింది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్లీన్‌ స్వీప్‌ దిశగా వెళ్తోంది. ఇదిలా ఉంటే.. వైసీపీ మంత్రులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో.. ఆ పార్టీకి పరాభవం ఎదురైంది. అందరు మంత్రులు ఓటమికి అంచున ఉన్నారు. ఇక నగరిలో మంత్రి ఆర్‌కే రోజా తన సవిూప టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాశ్‌పై ఓటమికి చేరువగా రెండో స్థానానికి పరిమితమైంది. టీడీపీ అభ్యర్ధి ముందంజలో ఉండగా.. రోజా ఓటమి దిశగా పయనిస్తున్నట్టు ట్రెండ్స్‌ చెబుతున్నాయి. ఈ తరుణంలో రోజా తన ఓటమిని అంగీకరిస్తూ.. ఎక్స్‌ వేదికగా ఫలితాలపై ఆసక్తికర ట్వీట్‌ చేశారు. చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ.. ’భయాన్ని విశ్వాసంగా ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్‌ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది.

రెండు రౌండ్లు పూర్తవగానే రోజా ఇంటి బాట పట్టారు. వైసీపీలో ఎగిరెగిరి పడిన నేతల్లో రోజా ఒకరు. ఆమె నోటికి ఎవరైనా భయపడాల్సిందే. నియోజకవర్గానికి చేసిందేవిూ లేదు కానీ పార్టీకి మాత్రం అన్నీ తానయ్యారు. అంటే పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కాదు. అధినేత జగన్‌పై ఏ చిన్న విమర్శ వచ్చినా విరుచుకుపడటంలో.. విూడియా ముందు ప్రత్యక్షమై నోటికి పనిచెప్పే నేతల్లో కొడాలి నాని తర్వాత స్థానం రోజాదే. అలాంటి రోజా ఓటమి ముందుగానే ఫిక్స్‌ అయిపోయింది. ఆమెకసలు సీటే ఇవ్వొద్దని వైసీపీ నేతలంతా అధినేత వద్ద నెత్తీ నోరు కొట్టుకున్నారు. ఎవరి మాటా వినకుండా రోజాకు టికెట్‌ కేటాయించారు. ఇంకేముంది? అసలే టీడీపీ హవా పెద్ద ఎత్తున వీస్తోంది. పైగా రోజాకు సొంత పార్టీ నుంచి కూడా ఏ మాత్రం బలం లేదు. అంతా వ్యతిరేకమే. జే ట్యాక్స్‌ మాదిరిగా తన నియోజకవర్గమైన నగరిలో రోజా ట్యాక్స్‌ పెట్టారు. పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.  దందాలకు హద్దు లేకుండా పోయింది. అధికారం రోజాది.. పెత్తనం ఆమె అన్నలది. ఎన్ని ఆరోపణలు  వెళ్లినా అధిష్టానం కూడా పట్టించుకోలేదు.

రోజా విషయంలో కన్నెర్ర చేయలేదు. వెరసి రోజా దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. దీంతో ఇక రోజా రాజకీయం జీవితం అయిపోయినట్టేనని చర్చ మొదలయ్యింది. వైసీపీ పరిస్థితే ఇప్పుడు ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదు. నిన్న మొన్నటి వరకూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఇటు అసెంబ్లీ, అటు లోక్‌సభలో వైసీపీ దారుణ పరాజయం పాలైంది. ఇక విూదట కేంద్రం సపోర్ట్‌ కూడా ఉండదు. మొత్తవ్మిూద వైసీపీ అధినేతకు గడ్డుకాలమే. 

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP