04-06-2024 RJ
తెలంగాణ
మహబూబ్‌నగర్, జూన్ 4: సిఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లా ప్రజలు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అపజయం ఖాయమయ్యింది. ఇక్కడ బిజెపి అభ్యర్థి డికె అరుణ విజయం దాదపుగా ఖారారు అయ్యింది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 8 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో ఆయనకు భంగపాటు తప్పేలా లేదు.
ఇప్పటి వరకు ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 25,957 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లోనూ మహబూబ్‌నగర్ ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉండటం గమనార్హం. మొత్తంగా డికె అరుణ జెండా ఎగరేయడం ఖాయం.