04-06-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, జూన్ 4: ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి అక్కడి నుంచి ఘన విజయం సాధించారు. ఆయన తన సవిూప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుపై 3,70,921 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రామసహాయం రఘురామ్ రెడ్డి కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. చివరికి భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన తాండ్ర వినోద్ రావు మూడో స్థానానికి పరిమితమయ్యారు. కాగా రామసహాయం రఘురామ్‌రెడ్డి తెలుగు నటుడు వెంకటేశ్‌కు, కాంగ్రెస్ నేత, పారిశ్రామికవేత్త పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు.
రఘురామ్ రెడ్డి ఇద్దరు కొడుకుల్లో ఒకరికి వెంకటేశ్, మరొకరికి పొంగలేటి తమ బిడ్డలను ఇచ్చి వివాహం జరిపించారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలంగాణలో తొలి విజయం నమోదైంది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 3.5 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సవిూప ప్రత్యర్థి, భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఆయన విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన మల్లు రవి (నాగర్‌కర్నూల్), కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీకృష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), బలరాం నాయక్(మహబూబాబాద్), కుందురు రఘువీర్ రెడ్డి (నల్గొండ), సురేశ్ షెట్కార్(జహీరాబాద్) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.