04-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 4: కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణెళిష్ విజయం సాధించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి నివేదితపై 9,725 ఓట్లతో శ్రీగణేశ్ ఘన విజయం సాధించారు. కాగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన పెద్ద కుమార్తె లాస్య నందిత బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలిచింది. కాగా, కొన్ని నెలలకే సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. దీంతో బిజెపి నుంచి పోటీ చేసిన శ్రీగణేశ్ తరవాత కాంగ్రెస్‌లో చేరి గెలిచారు.