04-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 4: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీ వినీ ఎరుగని విజయం సాధించడంతో చంద్రబాబు ప్రమాణస్వీకారం అంశంపై చర్చలు మొదలయ్యాయి. ఈ నెల తొమ్మిదో తేదీన అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వైసీపీ గెలుస్తుందని తొమ్మిదో తేదిన విశాఖలో జగన్ ప్రమణస్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ గెలుస్తుందని.. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యమైన విజయం సాధించడంతో అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు.
9న ఆయన సిఎంగా ప్రమాణం చేయను న్నారు. ఈ క్రమంలో రాత్రికి పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు చర్చలు జరుపనున్నారు. ఇదిలావుంటే ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. విజయం దిశగా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తు న్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తెదేపా కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో సందడి నెలకొంది. అదేవిధంగా విశాఖ, మంగళగిరిలోని తెదేపా కార్యాలయాల వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.