04-06-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, జూన్ 4: నిజామాబాద్ ఎంపి అభ్యర్థిగా మరోమారు ధర్మపురి అర్వింద్ గెలుపొందారు. సవిూప కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ఆయన 1.13లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఎన్నికల సరళిని చూస్తే వార్ వన్‌సైడం అన్నట్లుగా సాగింది. అలాగే బిజెపి మొత్తం 8స్థానాల్లో గెలుపొందింది. గతంలో ఉన్న నాలుగు సీట్లను 8కి తెచ్చింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు సత్తా చాటాయి. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆదినుంచి దూసుకుపోయారు. ఈయనకు 2,82,634 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి 45,100 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ మాత్రం 2.31 లక్షల ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణలో ఎక్కడా బీఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేస్తోంది.
మూడో సారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అర్వింద్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. మోడీ మూడోసారి ప్రధాని కానున్నారు.. నిజమాబాద్ పార్లమెంటులో 5 లక్షల స్వయం సహాయక సంఘాలకు కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చామన్నారు. 7 లక్షల పైన ఆయుష్మాన్ భారత్ కార్డులిచ్చామన్నారు.గత 2 ఏళ్లుగా పసుపు రైతులకు మేలు చేసేలా స్పైసీస్ బోర్డు, పసుపు బోర్డు పని చేస్తోందన్నారు. కేంద్రం పసుపు ఎగుమతులు పెంచటం ద్వారా రైతులకు మంచి ధరలు వస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోడీ చొరవతో పసుపు రైతులకు మేలు చేకూరనుందన్నారు. మోడీ ప్రపంచ దిశానిర్దేశకుడన్నారు. రాజకీయ నాయకుడనే మాటకు అర్థాన్ని మార్చేసిన నేత మోడీ అని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ లోక్‌సభ సీటు నుంచి భాజపా అభ్యర్థి గోడం నగేష్ విజయం సాధించారు. 78వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయం సాధించారు. వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2.02లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3.24లక్షల మెజార్టీతో విజయం సాధించారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 45వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్‌కుమార్ రెడ్డి 1.95లక్షలకు పైగా మెజార్టీతో విజయఢంకా మోగించారు. నాగర్‌కర్నూలులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి 85వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
నిజామాబాద్‌లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 1.13లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కరీంనగర్ లోక్‌సభ సీటు నుంచి భాజపా నేత బండి సంజయ్ 2.12లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు...మహబూబ్‌నగర్‌లో డికె అరుణ, చేవెళ్లలో కొండా విశ్వేవ్వర్ రెడ్డి, మల్కాజిగిరిలో ఈటెల రాజేంద్ విజయం సాధించారు.