04-06-2024 RJ
సినీ స్క్రీన్
మంగళూరు సోయగం పూజా హెగ్డేకు గత కొంతకాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలు వరుసగా పరాజయం చెందడంతో రేసులో పూర్తిగా వెనకబడిపోయింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేసిందీ భామ. ఆమె కోరుకున్నట్లుగానే తమిళంలో సూర్య సరసన నటించే బంపరాఫర్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం సూర్య పీరియాడిక్ చిత్రం ’కంగువ’లో నటిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నారు.
సూర్య నటించబోతున్న 44వ చిత్రమిది. ఈ నెలలోనే సెట్స్‌విూదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఖరారు చేశారు. ’బీస్ట్’ తర్వాత పూజాహెగ్డే తమిళంలో మరే చిత్రంలో నటించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత అక్కడ భారీ అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రం తప్పకుండా పూజాహెగ్డే కెరీర్‌కు బ్రేక్‌నిస్తుందని, ఆమె తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.