ad1
ad1
Card image cap
Tags  

  05-06-2024       RJ

అహంకారంపై అంకుశం.. అక్రమాలపై ప్రజల త్రివిక్రమావతారం

ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ తరహాలోనే ఎపిలోనూ తీర్పు
  • ప్రజల నాడి పట్టలేక పోయిన వైకాపా నేతలు

అమరావతి, జూన్‌ 5: ప్రజలు కేవలం డబ్బుల పందేరాన్ని కాకుండా అభివృద్దిని కూడా కోరుకుంటారని, అలాగే అరాచకాలను సహించరని ఎపి ప్రజలు స్పష్టం చేశారు. జగన్‌ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ఈ రెండూ కారణమని రాజకీయ వేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ముందే ఈ విషయం చెప్పారు. కేవలం డబ్బులు పందేరం చేసి, అభివృద్దిని పక్కన పెట్టరాదన్నారు. అలాగే నిరంకుశ, అక్రమాలను కూడా సమించరని అర్థం అయిపోయింది. ప్రజలు దేనినైనా సహిస్తారు కానీ.. అహంకారాన్ని ఉపేక్షించబోరనడానికి తెలంగాణ, ఏపీ ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తమకు తిరుగులేదు అన్ని స్థానాల్లో విజయం మాదే.. అభ్యర్థికంటే తనను చూసే ఓటేస్తారని తెలంగాణలో గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ భావించారు. కానీ ప్రజలు మాత్రం అభివృద్ధి, సంక్షేమం పక్కనపెడితే అహంకారాన్ని సహించబోమని తీర్పునిచ్చారు.

ప్రతిపక్షాలను పట్టించుకోకుండా.. ప్రజలను చిన్నచూపు చేసే నాయకులు మాకొద్దని తిరస్కరించారు. వ్యవస్థలను తప్పుదోవపట్టించి.. రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటే సహించేది లేదంటూ కేసీఆర్‌ను గ్దదె దించారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రఅభివృద్ధిని పక్కనపెట్టి.. రాజకీయ కక్ష తీర్పుకోవడానికి వ్యవస్థలను ఉపయోగించుకున్నారనేది బహిరంగ రహస్యం. తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి వేధింపులకు గురిచేయడం ప్రజలకు నచ్చలేదు. ప్రజాపాలన అందిచమని అధికారం ఇస్తే ప్రజలను, రాష్ట్ర అభివృద్ధి గాలికొదిలేసి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయడాన్ని ప్రజలు తిరస్కరించారనేది ఎన్నికల ఫలితం స్పష్టం చేస్తోంది.

ఈ క్రమంలో తాము కోరుకుంటున్న విధంగా ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనపై ఓటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాలు స్పష్టం చేశాయి. సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్ల రూపాయిలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా ఓట్లు పడకపోవడం వైసీపీ అధినేత జగన్‌ను ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దపొందిన లబ్దిదారులు ఓట్లు వేస్తారని భావించిన జగన్‌ ఆశలు నెరవేరలేదు. ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేశామని జగన్‌ చెప్పుకున్న గొప్పలను ప్రజలు విశ్వసించ లేదు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి.. సంక్షేమ పథకాల కోసం లక్షల కోట్లు అప్పులు చేయడం ప్రజలకు నచ్చలేదు.

రాజధాని విషయంలో జగన్‌ నిర్ణయాన్ని ప్రజలు తప్పుపట్టారనేది ఎన్నికల ఫలితాలు తెలియ జేస్తున్నాయి. అలాగే రాజధాని ఉద్యమంలో ముందుకు నడిచిన రైతులను కనీసం పరామర్శించక పోగా వారినందరినీ పెయిడ్‌ ఆర్టిస్టులుగా చిత్రీకరిచి, కేసులతో జైలుకు పంపిన తీరు కూడా చూసాం. సంక్షేమ పథకాలు అమలు చేసినా.. పేద, మధ్య తరగతి ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేసినా ఓట్లు ఎందుకు పడలేదనే ప్రశ్నలతో ఇప్పుడు వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ ఇంతటి ఘోర పరజాయానికి కారణం ఏమిటో ప్రజలకు మాత్రం అర్థం అయ్యింది.  కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదంటే ప్రజలు జగన్‌ తీరుపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతోంది.

వైసీపీ ఓటమికి జగన్‌ పాలనాతీరు, జగన్‌ అహంకార పూరిత ప్రవర్తన అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. ముఖ్యంగా ఐదేళ్ల పాలనలో ఏ మేరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారనేది ఒక ఎత్తయితే.. ప్రభుత్వ ప్రవర్తన ఏ విధంగా ఉందనేది మరో ఎత్తు. వైసీసీ అధినేత జగన్‌తో పాటు ఆయన మంత్రివర్గంలోని సహచరుల ప్రవర్తన ప్రజలకు నచ్చకపోవడంతోనే ఈ విధమైన తీర్పు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. నాయకుడు అహంకారంతో విర్రవీగితే ఏమౌతుందో ప్రజలు రుచి చూపించారు. ఐదేళ్లు సీఎంగా జగన్మోహన్‌ రెడ్డి విపరీతమైన అహంకార ధోరణిని ప్రదర్శించడమే ప్రస్తుతం ఆయన ఓటమికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. వైసీపీ నాయకుల ప్రవర్తనే వారిని ఓడిరచిందనే చర్చ జరుగుతోంది.

వైసీపీలో గ్రామ స్థాయి నాయకుడు మొదలు రాష్ట్రస్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పడం మానేసి... ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన నేతలను టాª`గ్గంªట్‌ చేసి ఇబ్బంది పెట్టడాన్ని రాష్ట్రప్రజలు అంగీకరించలేదనేది ఈ ఫలితాలకు తర్కాణం. తాను పదుల సంఖ్యలో నొక్కిన బటన్లు ఓట్లు తెచ్చిపెట్టలేదని ఫలితాల తర్వాత జగన్‌ బాధపడటం కన్నా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలకు పోకుండా అభివృద్ధిపై దృష్టిపెడితే ఇలాంటి ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చేది కాదనే చర్చ రాష్ట్రంలో నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అహంకారంతో వ్యవహరించే నాయకులకు ఏపీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP