06-06-2024 RJ
సినీ స్క్రీన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అఖండ విజయాన్ని సాధించడంతో మెగా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కుమారుడు అకీరా ఎడిట్ చేసిన వీడియోను రేణూ దేశాయ్ పంచుకోగా వైరల్‌గా మారింది. నెటిజన్లంతా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ’కొన్ని వారాల క్రితం వాళ్ల నాన్న కోసం అకీరా నందన్ చేసిన ప్రత్యేక వీడియో ఇది. పవన్‌పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. తన తండ్రి విజయంపై అకీరా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాడు’ అని రేణు దేశాయ్ దీనికి క్యాప్షన్ పెట్టారు.
’ఖుషి’ నుంచి ’భీమ్లానాయక్’ వరకు పవన్ చేసిన సినిమాల్లోని పవర్‌ఫుల్ డైలాగులతో దీన్ని ఎడిట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా ’గూస్‌బంప్స్ వస్తున్నాయంటూ’ నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ’ఎమ్మెల్యే గారి అబ్బాయి చేసిన వీడియో బాగుంది’ అని ఒకరు కామెంట్ చేయగా.. ’ఇప్పటి వరకు చూసిన వాటిల్లో ఇదే బెస్ట్ వీడియో’ అని మరో అభిమాని పేర్కొన్నారు.