06-06-2024 RJ
సినీ స్క్రీన్
విజయ్ దేవరకొండతో సాయిపల్లవి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. సాయిపల్లవి సినిమాల విషయంలో వేగం పెంచింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ’తండేల్’ చేస్తూనే హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు చేస్తోంది. అలాగే తమిళంలో ’అమరన్’లో నటిస్తోంది. అయితే ఇప్పుడామె కొత్తగా మరో కథ విన్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
అందమైన ప్రేమకథతో రూరల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానున్న ఈ చిత్రం కోసం నాయికగా సాయిపల్లవిని ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమెతో కథా చర్చలు పూర్తయ్యాయని.. సినిమా విషయంలో ఆమె సానుకూలంగా ఉందని సమాచారం. దీన్ని వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.