ad1
ad1
Card image cap
Tags  

  07-06-2024       RJ

యుద్ధ ప్రాతిపదికన పార్వతి బ్యారేజ్‌ పునరుద్ధరణ పనులు

తెలంగాణ

  • ప్రతి పనికి నిర్దిష్ట సమయం నిర్దేశిరచుకోవాలి 
  • డ్యామ్‌ సెప్టీ అథారిటీ సూచనల ప్రకారం బ్యారెజ్‌ పునరుద్ధరణ 
  • బ్యారేజ్‌ వల్ల వచ్చే సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు 
  • నిర్మాణ సంస్థలకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ ఆదేశం
  • అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల పరిశీలన
  • 94 వేల కోట్లతో కట్టినా పనికిరాకుండా పోయిందన్న ఉత్తమ్‌

కరీంనగర్‌, జూన్‌ 7: కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బ తిన్న చోట్ల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని నిర్మాణ సంస్థలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ ముగియడంతో అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల పరిశీలనకు మంత్రి ఉత్తమ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ వల్ల కాళేశ్వరంపై రివ్యూ జరగలేదు. భారాస హయాంలోనే మేడిగడ్డ కుంగింది. రూ.94 వేల కోట్లు అప్పు చేసి కట్టిన ప్రాజెక్టు కుంగిపోతే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం దానికి వడ్డీ కట్టాల్సి వస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ ఆథారిటీని సంప్రదించి పరిశీలన చేయమని కోరాం. నిపుణుల కమిటీ కొన్ని సూచనలు చేసింది. మేడిగడ్డ కుంగిన వెంటనే గేట్లు ఎత్తి ఉంటే ఇంత డ్యామేజీ జరిగేది కాదని తేల్చింది. దెబ్బతిన్న చోట్ల కొన్ని రిపేర్లు చేసి అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల మూడు బ్యారేజీల గేట్లు ఎత్తిపెట్టాలని చెప్పింది. ఆ పనుల పరిశీలన చేయడానికి వచ్చా.

మేడిగడ్డ, అన్నారం వద్ద పనులు వేగంగా జరుగుతున్నాయి. సుందిళ్ల బ్యారేజీ పనులు నెమ్మదిగా జరుగుతుండటంతో వేగవంతం చేయాలని చెప్పాం. వర్షాలకు ముందే పనులు పూర్తి కావాలని నిర్మాణ సంస్థలను ఆదేశించాం. తుమ్మడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మిస్తాం అని ఉత్తమ్‌ చెప్పారు. రిపేర్లు చేసినా  బ్యారేజీల గేట్లు ఎత్తాల్సిందే నన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. కాళేశ్వరంలోని  బ్యారేజీలను పరిశీలించిన ఉత్తమ్‌..  ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకే మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పారు. నిపుణుల కమిటీ సూచనలు ఇచ్చే వరకు గేట్లు ఓపెన్‌ చేస్తామని చెప్పారు. కేసీఆరేమో నీళ్లు స్టోరేజ్‌ చేయొచ్చని ప్రచారం చేస్తున్నారు.. ఎన్డీఎస్‌ఏ  వద్దంటోందని అన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌ లో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు  ఉత్తమ్‌. సుందిళ్లలో నవయుగ కంపెనీ పనుల్లో ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు. పనులు వేగవంతం చేయాలని నవయుగ కంపెనీ ప్రతినిధులను హెచ్చరించామన్నారు. కాంట్రాక్టు నిర్మాణ సంస్థల ఖర్చుతోనే ప్రస్తుతం తాత్కాలిక మరమ్మత్తులు జరుగుతున్నాయని చెప్పారు.  

ఎల్లంపల్లికి నీటిని ఎత్తి పోయవచ్చని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే మేడిగడ్డ కుంగిందన్నారు.   పాలమూరు రంగారెడ్డికి 20 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎకరాకు నీళ్ళియ్యలేదన్నారు.    ఎన్నికల కోడ్‌ ఉండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ  చేయలేదన్నారు ఉత్తమ్‌. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది.. 90వేల కోట్లకు వడ్డీ చెల్లిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఫలితాలు చూసిన తర్వాత కేసిఆర్‌ గురించి మాట్లాడుకోడం వేస్ట్‌ అని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నీళ్లు వచ్చే ప్రాజెక్ట్‌ చేపట్టడతామని చెప్పారు. సుందిళ్ళ బ్యారేజ్‌ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను, గుత్తేదారు ఏజెన్సీలను ఆదేశించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మూడు బ్యారేజ్‌ల సందర్శనలో భాగంగా శుక్రవారం తొలుత మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మంథని మండలం సిరిపురం గ్రామం వద్ద నిర్మించిన సుందిళ్ల (పార్వతి) బ్యారేజ్‌ ను సందర్శించారు. సుందిళ్ల (పార్వతి) బ్యారేజ్‌ ను ఆసాంతం మంత్రి పరిశీలించారు. జాతీయ డ్యామ్‌ సేప్టీ అథారిటీ అందించిన సూచనల ప్రకారం మరమ్మత్తు, పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తి కావాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిలో ఆశించిన మేర ఫలితం కనపడటం లేదని, అవసరమైన మేర అదనపు బృందాలను ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. బ్యారేజ్‌ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని, ప్రతి పనికి సంబంధించి నిర్దేశిత సమయాన్ని నిర్దేశించుకొని దానిలోపు ఆ పని పూర్తి చేసే విధంగా ఏజెన్సీలు పనిచేయాలని, ఏ పని ఎప్పటి వరకు పూర్తవుతుందో కాగితంపై షెడ్యూల్‌ రూపొందించి అందించాలని మంత్రి ఆదేశించారు.

సుందిళ్ల (పార్వతి) బ్యారేజ్‌ సవిూపంలో గల పంప్‌ హౌస్‌ సంరక్షణ కోసం నిర్మిస్తున్న కట్ట వల్ల స్థానికులకు కలిగే నష్టాన్ని స్థానిక మంత్రివర్యులు తో కలిసి అంచనా వేసి వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారిని ఆదేశించారు. ప్రాజెక్టు ఈ.ఎన్‌.సి అనిల్‌ కుమార్‌ జాతీయ డ్యామ్‌ సేప్టీ అథారిటీ ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పనుల వివరాలను మంత్రికి వివరించారు. రాబోయే వానాకాలంలో మూడు బ్యారేజీల సంరక్షణకు, తదుపరి ఎటువంటి డ్యామేజీ జరగకుండా పనులు చేపట్టామని ఈఎన్సీ తెలిపారు. సుందిళ్ల (పార్వతి) బ్యారేజ్‌ వద్ద  కొట్టుకుపోయిన ఇసుక పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని , జాతీయ డ్యామ్‌ సేప్టీ అథారిటీ సూచనల ప్రకారం జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌ జనరల్‌ పరీక్షలు నిర్వహించి కొట్టుకుపోయిన ఇసుకను అంచనా వేసి వాటిని పునరుద్ధరించి బ్యారేజ్‌ ఎటువంటి మరమ్మత్తుకు గురికాకుండా సంరక్షణ చర్యలు చేపడుతున్నామని, మంత్రి ఆదేశాల మేరకు పనులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేసి రాబోయే పది రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని ఈఎన్సీ అన్నారు.

అనంతరం విూడియాతో రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ  గత ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినప్పటికి నిర్లక్ష్యం వహిస్తూ ఎటువంటి మరమ్మత్తులు చేపట్టలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత  3 బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని, దేశంలోనే పార్లమెంట్‌ ద్వారా ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థ అయిన జాతీయ డ్యామ్‌ సేప్టీ అధారిటీలకు బాధ్యత అప్పగించడం జరిగిందని అన్నారు. జాతీయ డ్యామ్‌ సేప్టీ అథారిటీ అందించిన మద్యంతర నివేదిక ప్రకారం రాబోయే వానా కాలంలో మూడు బ్యారేజీల సంరక్షణ కోసం పనులు చేపట్టామని, క్షేత్రస్థాయిలో బ్యారేజీలను పరిశీలించి ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా సంబంధిత ఏజెన్సీలను, ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను పరిశీలించేందుకు తమ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ జడ్జ్‌  జస్టిస్‌  ఆధ్వర్యంలో వేసిన  జ్యుడీషియల్‌ కమిషన్‌ సైతం ప్రాజెక్టును సందర్శిస్తుందని మంత్రి అన్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని తప్పనిసరిగా నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం భూపాల్‌ పల్లి జిల్లాలో ఉన్న అన్నారం(సరస్వతి) బ్యారేజీ సందర్శనకు మంత్రి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈ.ఎన్‌.సి జనరల్‌ జి.అనిల్‌ కుమార్‌, ఎస్‌.ఈ.ఏం. కరుణాకర్‌, ఈ.ఈ. సర్దార్‌ ఓంకార్‌ సింగ్‌, ఇతర నీటీ పారుదల అధికారులు, మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పెండ్రు రమా సురేష్‌ రెడ్డి , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP