07-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 7: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్‌గా ఉన్న కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్ నియామకం జరిగింది. కొత్త సీఎస్ నియమాకం జరిగినందున జవహర్‌రెడ్డిని బదిలీ చేశారు. ఆ వెంటనే ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు.
బుధవారం ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఈ క్రమంలోనే సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తా ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో వైపు నూతన సీఎస్‌గా నియమితులైన నీరభ్ కుమార్ ప్రసాద్ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో బాధ్యతలు చేపట్టారు.