08-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 8: ధరణి పోర్టల్ చుట్టూ వివాదాలు సద్దు మణగలేదు. ధరణిని అడ్డం పెట్టుకుని చేసిన చేతివాటాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రభుత్వ భూములను కిందిస్థాయిలో అధికారులు కూడా అమ్మేసుకున్నారు. గ్రామాల్లో ధరణితో తాము నష్టపోతున్నామంటూ ఆందోళనల చెందుతున్న వారి సంక్య పెరుగుతున్నాయి.ధరణితో కెసిఆర్, ఆయన అనుచరులు భూములను కాజేసిన వ్యవహారం మెల్లగా బయటపడుతోంది. తాజాగా రాంగారెడ్డి శంషాబాద్‌లో ప్రభుత్వ భూములను కాజేసిన తీరు ఆవ్చర్యం కలిగిస్తోంది. అయితే ధరణి మొదలు పెట్టినప్పటి నుంచే వివాదాలు, రైతుల ఆత్మహత్యల బెదిరింపులు, పంచాయితీలు, కొట్లాటలు నడిచాయి. అక్రమాలను పట్టించుకోని కెసిఆర్.. ధరణిపై విమర్శలు చేసే వారిని బంగాళాఖాతంలో విసిరేయాలని కెసిఆర్ స్వయంగా పిలుపునిచ్చారు. ఆయన ఎన్నికల ప్రచారం అంతా ఇలాగే సాగింది. మొత్తంగా ధరణి పోర్టల్ వివాదం తెలంగాణలో పెను రాజకీయ ప్రకంపనలను రేపింది. కాంగ్రెస్ అధికారం చేపట్టాక కోదండరెడ్డి అధ్యక్షతన కమిటీ వేసింది. కమిటీ దీనిపై లోతుగా అధ్యయనం చేస్తోంది.