08-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 8: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి తరలివెళ్లి విూడియా సంస్థ అధినేతకు నివాళులర్పిస్తున్నారు. రామోజీ రావు మరణ వార్త సినీ ఇండస్టీన్రి తీవ్రంగా కలచివేసింది. ఈ నేపథ్యంలో రామోజీ మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణానికి సంతాప సూచికంగా ఆదివారం చిత్ర పరిశ్రమకు బంద్ ప్రకటించారు. ఈ మేరకు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసింది. ఆదివారం అన్ని షూటింగ్‌లూ నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
ఇదిలావుంటే ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి, కీరవాణి, రాజేంద్ర ప్రసాద్, ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు రామోజీ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.