ad1
ad1
Card image cap
Tags  

  08-06-2024       RJ

ఉషాకిరణ్‌తో సినీరంగ ప్రవేశం.. దాదాపు 87 చిత్రాల నిర్మాణం

సినీ స్క్రీన్

  • ఎందరో కొత్తవారికి తెర పరిచయం

పాత్రికేయంతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన రామోజీ రావు.. సినీరంగంలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థను స్థాపించి, వివిధ భాషల్లో 87 చిత్రాలను నిర్మించి ఎంతోమంది కొత్త నటీనటులను రంగుల పరిశ్రమకు పరిచయం చేశారు. సమున్నత పాత్రికేయ విలువలకు పట్టంగట్టే ఈనాడుకు అనుబంధంగా ప్రారంభమైనదే ’సితార’ సినిమా వారపత్రిక. రంగుల లోకంలోని విశేషాలను సమగ్రంగా అందించేలా దాన్ని ప్రారంభించారు. 1976లో ఇది పాఠకుల ముంగిటకు వచ్చింది. కేవలం వార్తలు, కథనాలను అందించేందుకు పరిమితం కాకుండా విలువలున్న చిత్రాల్ని ప్రోత్సహించే దిశగానూ రామోజీ ఆలోచన చేశారు. ఆరోగ్యకరమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలనే సదుద్దేశంలో 1983లో రామోజీరావు ఉషాకిరణ్‌ మూవీస్‌ను ప్రారంభించారు.

ఉషాకిరణ్‌ మూవీస్‌పై నిర్మించిన తొలి సినిమానే సూపర్‌ హిట్‌గా నిలిచింది. ’ప్రేమలేఖ’ నవలను చిత్రంగా మలచాలని భావించారు. ఆ కథను తెరకెక్కించే బాధ్యతను జంధ్యాలకు అప్పగించారు. ఆ సినిమానే ’శ్రీవారికి ప్రేమలేఖ’. ఈ చిత్రం 1984 మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పు పొందింది. కథలనేవి కల్పనల్లోంచి కాదు.. జీవితాల్లోంచి పుడతాయని ఉషాకిరణ్‌ మూవీస్‌ నిరూపించింది. అందుకు ఉదాహరణెళి ఈ సంస్థ నుంచి వచ్చిన నాలుగో చిత్రం ’మయూరి’. ఒక హిందీ పత్రికలో వచ్చిన వార్తను సినిమాగా మలిచి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. ప్రమాదంలో కాలును పోగొట్టుకొని, కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధా చంద్రన్‌ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు. ఆ పాత్రలో సుధా చంద్రన్నే నటించారు. స్ఫూర్తివంతమైన ఆ చిత్రం వచ్చి రెండున్నర దశాబ్దాలు దాటిపోయినా ఉషాకిరణ్‌ మూవీస్‌ అనగానే ’మయూరి’ తప్పకుండా గుర్తుకొస్తుంది.

సినిమా అంటే రెండున్నర గంటలపాటు ఊహాలోకంలో విహరింపజేయడం మాత్రమే కాదని నిరూపించిన చిత్రమిది. మౌనపోరాటం ` యథార్థ సంఘటనలను తెరకెక్కించడంలో ఉషాకిరణ్‌ మూవీస్‌ కి ఓ ప్రత్యేకత ఉంది. ఒడిశాలో జరిగిన సంఘటన ఆధారంగా ’మౌన పోరాటం’ చిత్రాన్ని నిర్మించారు. మగాడి చేతిలో మోసపోయిన ఓ వనిత పోరాటాన్ని ప్రభావశీలంగా తెరపై ఆవిష్కరించారు. 1989లో విడుదలైన ఆ చిత్రం ఎందరినో ఆలోచింపచేసింది.ప్రతిఘటన ` ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ ఏనాడూ కథానాయికనుగానీ, ఏ స్త్రీ పాత్రనుగానీ బలహీనంగా చూపించలేదు. ఆ పాత్రకు ఔచిత్యం, మనో ధైర్యం ఉండేలా తీర్చిదిద్దారు. ఇందుకు ’ప్రతిఘటన’ తార్కాణం. సంఘ విద్రోహులతో పోరాడే తెగువ ఉన్న ఓ వనిత గాథను ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల మదిలో చెరిగిపోకుండా ఉంది. ఆ చిత్రంలోని ’ఈ దుర్యోధన...’ పాటను ఎవరైనా మరువగలరా? ఆ పాటలోని సాహిత్యాన్ని ఆమోదించేందుకు ముందుగా నిర్మాతకు సంకల్ప బలం కావాలి.

అది రామోజీరావుకు ఉంది కాబట్టే రచయిత వేటూరి రాయగలిగారు... దర్శకుడు టి. కృష్ణ అంతే శక్తిమంతంగా చిత్రించగలిగారు.క్రీడా కారిణి అశ్విని నాచప్పను కెమెరా ముందుకు తీసుకొచ్చింది కూడా ఈ సంస్థే. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తిదాయక చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే  అశ్వని కథ. ఆ పాత్రకు నిజ జీవితంలో క్రీడాకారిణి అయితే బాగుంటుందన్న ఆలోచనతోనే అశ్వని నాచప్పను ఎంచుకున్నారు. క్రీడలకే పరిమితమైన ఆమె.. కథ నచ్చడంతో పాటు, ఉషాకిరణ్‌ మూవీస్‌ విశిష్టతను తెలుసుకుని నటించేందుకు పచ్చజెండా ఊపారు. ఇలా చెబుతూ వెళ్తే ప్రతి చిత్రం వెనక ఓ బలమైన నేపథ్యం, ఓ సంకల్పం ఉంటాయి. తేజ, మనసు మమత, అమ్మ, జడ్జిమెంట్‌, ’పీపుల్స్‌ ఎన్‌ కౌంటర్‌... అన్నీ నాటి సామాజిక పరిస్థితులకు దర్పణం పట్టినవే. చిత్రం, నువ్వే కావాలి, ’ఆనందం వంటి ఘనవిజయాలున్నాయి. నచ్చావులే, బెట్టింగ్‌ బంగా ర్రాజు, నువ్విలా లాంటి ప్రేక్షకులను ఉల్లాసపరిచే చిత్రాలు వచ్చాయి. ’నువ్వే కావాలి’ సాధించిన వసూళ్లూ, సృష్టించిన రికార్డులూ ఆ ఏడాది ఏ మాస్‌ హీరోకీ తీసిపోనివే. చిన్న చిత్రాల రూపకర్తలకు ధైర్యాన్నిచ్చినవే.

కొత్త ట్రెండ్‌ సృష్టించినవే. కేవలం తెలుగు చిత్రాలకే ఉషాకిరణ్‌ మూవీస్‌ పరిమితం కాలేదు. ’నాచే మయూరి’, ’ప్రతిఘాత్‌’, చిత్రాలతో బాలీవుడ్‌లోనూ జయకేతనం ఎగరేసింది. కన్నడ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ఇప్పటి వరకూ 87 చిత్రాలు నిర్మించిందీ సంస్థ. తొలి చిత్రం ’శ్రీవారికి ప్రేమలేఖ’ నుంచే ప్రేక్షకుల మెప్పుతో పాటు ప్రభుత్వ పురస్కారాలూ వరించాయి. కాంచనగంగ, మయూరి, ప్రతిఘటన, ’తేజ’, ’మౌనపోరాటం’ లాంటి చిత్రాలకు నంది అవార్డులు దక్కాయి. ’మయూరి’లో నటించిన సుధాచంద్రన్‌కు ఏకంగా జాతీయస్థాయిలో ప్రత్యేక పురస్కారం లభించింది. ’నువ్వే కావాలి’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయస్థాయి అవార్డు అందుకుంది. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటీనటులు ఎందరో ఉన్నారు. ప్రతిభ ఉంటే చాలు అవకాశమిచ్చి ప్రోత్సహించారు.

శ్రీకాంత్‌, వినోద్‌కుమార్‌, చరణ్‌ రాజ్‌, యమున, వరుణ్‌ రాజ్‌, ఎన్టీఆర్‌, ఉదయ్‌ కిరణ్‌, తరుణ్‌, రీమాసేన్‌, శ్రియ, జెనీలియా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, రిచా పల్లోడ్‌, మాధవీలత... ఇలా ఎందరో నటులు ఈ సంస్థ ద్వారానే చిత్రసీమకు పరిచయమయ్యారు. గాయనిగా ఉన్న ఎస్‌. జానకి సంగీత దర్శకురాలైంది కూడా ’మౌనపోరాటం’ చిత్రంతోనే. మల్లికార్జున్‌, ఉష, గోపికా పూర్ణిమ లాంటి గాయనీగాయకులను శ్రోతలకు చేరువ చేసింది కూడా ఈ సంస్థే. సినిమా తీయడం ఒక ఎత్తు. దాన్ని ప్రేక్షకుల ముంగిటకు తీసుకువెళ్లడం మరో ఎత్తు. చిత్ర నిర్మాణంతోపాటే పంపిణీ విభాగానికీ ’మయూరి ఫిల్మ్‌ డిస్టిబ్యూట్రర్స్‌’ ఏర్పాటుతో శ్రీకారం చుట్టారు.

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

02, Sep 2024

నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ళ సినీ స్వర్ణోత్సవం

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP