ad1
ad1
Card image cap
Tags  

  08-06-2024       RJ

తెలంగాణ ప్రయోజనాల తాకట్టు

తెలంగాణ

  • ఆదిత్యనాథ్‌ దాస్‌ను వెంటనే తొలగించాలి
  • మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌

హైదరాబాద్‌, జూన్‌ 8: తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యానాథ్‌ దాస్‌ను తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదిత్యానాథ్‌ దాస్‌ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు. చంద్రబాబు ఆదేశిస్తున్నాడు.. శిష్యుడు రేవంత్‌ పాటిస్తున్నాడని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు పెత్తనం మొదలైందనడానికి ఈ నియామకమే నిదర్శనం అని నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవిని లాగేస్తారన్న భయంతో చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటాడా? నాడు జలయజ్ఞం ప్రాజెక్టుల నుండి నిన్న పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యాదాస్‌ది కీలకపాత్రని అన్నారు.

ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి ఎందుకు కట్టబెట్టారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేకిగా ముద్రపడ్డ వ్యక్తిని ఏ ప్రయోజనాల కోసం ఈ పదవిలో కూర్చోబెట్టారని నిరంజన్‌ రెడ్డి అన్నారు. వ్యక్తిగతంగా ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన పట్ల మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ ఆంధ్రకు కృష్ణా ప్రాజెక్టుల నుండి నీటిని తరలించడంలో ఆయనది కీలకపాత్ర. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి గత పదేళ్లుగా ఆయన ఏపీ తరపున కొట్లాడిన వ్యక్తి ఆయన తెలంగాణకు న్యాయం చేస్తాడా? కేఆర్‌ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపెట్టి ప్రాజెక్టుల విూద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనక కాంగ్రెస్‌ ఆలోచన ఏంటి..?

పోతిరెడ్డిపాడు, దుమ్ముగూడెం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలతో తెలంగాణ నీటిని తరలించడంలోనూ ఆదిత్యాదాస్‌దే కీలకపాత్ర.. అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రయోజనాల కోసం కృషిచేస్తాడా? తెలంగాణ ప్రాజెక్టులు, జల వనరుల విూద అపారమైన అనుభవం, అవగాహన ఉన్న ఎందరో జల నిపుణులు ఉన్నారు వారిని పక్కనపెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎంచుకోవడం వెనక కారణాలేంటి..? కాంగ్రెస్‌ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉంది అని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP