08-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
మచిలీపట్నం, జూన్ 8: ఎన్నికైన వెంటనే అలసత్వం ప్రదర్శించక టీడీపీ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగుతున్నారు. తమ నిజయోజకవర్గంలోని సమస్యలపై అధికారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆకస్మిక పర్యటనలతో కొల్లు రవీంద్ర అధికారులను హడలెత్తిస్తున్నారు. తొలిగా మచిలీపట్నం హెడ్ వాటర్ వర్క్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మచిలీపట్నంలో నెలకొన్న తాగునీటి సమస్యపై అధికారులతో సవిూక్షించారు.
కుళాయిల ద్వారా మురుగునీరు వస్తుండటంపై ఏఈ సాయిప్రసాద్‌పై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యకు గల కారణాలను మున్సిపల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి విషయంలో అలసత్వం వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.