08-06-2024 RJ
తెలంగాణ
హుజురాబాద్, జూన్ 8: రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ లారీ యజమానుల నుండి రోజుకు రూ. 50 లక్షల చొప్పున ఇప్పటికి రూ. 100 కోట్లు తీసుకున్నాడు. వే బిల్లులు లేకుండా అధిక లోడుతో బూడిద లారీలు వెళ్తున్నాయని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.రామగుండం ఎన్టీపీసీ నుండి హుజురాబాద్ విూదుగా ఖమ్మంకు ఎలాంటి వే బిల్లులు లేకుండా అధిక లోడుతో రోజుకు 300 బూడిద లారీలు వెళ్తున్నాయి. దీనికోసం రోజుకు రూ. 50 లక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వెళ్తున్నాయి. ఇలా ఇప్పటికే రూ. 100 కోట్లు వెళ్లాయి. వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.