08-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 8: తెలంగాణలో గ్రూప్`1 ప్రిలిమ్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది.. ఆదివారం జరగనున్న గ్రూప్ 1 పరీక్ష కోసం 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రూప్`1 ప్రిలిమనరీ పరీక్ష నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం టిజిఆర్‌టిసి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని.. రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేసి వెల్లడిరచారు. గ్రూప్`1 ప్రిలిమనరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం టిజిఆర్‌టిసి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులకు ఆదివారం రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని క్షేత్రస్థాయి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాల్విడం జరిగిందని సజ్జనార్ తెలిపారు.