11-06-2024 RJ
సినీ స్క్రీన్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ’కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదల కానుంది. తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసే ఎలివేషన్స్‌తో పవర్‌ఫుల్‌గా ఉందీ ట్రైలర్. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందా అంటే ఠక్కునే చెప్పే పేరు కల్కి 2898 ఏడీ సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానుల్లో జోష్ నింపుతున్నారు మేకర్స్. ఇప్పటకే రిలీజ్ చేసిన బుజ్జి, భైరవ విజువల్స్, ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఐమాక్స్ వెర్షన్‌లో కూడా సందడి చేసేందుకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా ఐమాక్స్ వెర్షన్ పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా ఐమాక్స్ వెర్షన్ ఉండబోతుందని తాజా పోస్టర్‌తో అర్థమవుతోంది.ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనుండగా.. అతడి దోస్త్ బుజ్జిగా స్పెషల్ కారు సందడి చేయనుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేందప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ టైటిల్, గ్లింప్స్ వీడియో, టీజర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఈ చిత్రంలో బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.