11-06-2024 RJ
సినీ స్క్రీన్
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ విూడియా కోడై కూస్తోంది. నటుడు జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి వివాహం జరగనుందంటూ వార్తలు వచ్చాయి. తన కూతురి వివాహంపై వచ్చిన రూమర్స్‌పై నటుడు శతృఘ్నసిన్హా స్పందించారు. వారిద్దరి ప్రేమాయణం గురించి ఇప్పటివరకు తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. సోనాక్షి వివాహం చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది. కానీ, దాని గురించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయం విూడియాకు కూడా తెలుసని.. విూ కూతురి వివాహం గురించి విూకు తెలియదా అని చాలామంది నన్ను అడిగారు. నిజంగా నాకు ఈ విషయం గురించి తెలియదు. ఎందుకంటే సోనాక్షి ఇప్పటివరకు నాకేవిూ చెప్పలేదు. ఒకవేళ నా కూతురి వివాహం జరిగితే.. బారాత్ ముందు డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నా అని శతృఘ్నసిన్హా ఓ విూడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల అనుమతి కోరడం లేదు. కేవలం సమాచారం ఇస్తున్నారు అంతే. ఇందుకోసం వేచిచూస్తున్నాం. సోనాక్షి నిర్ణయంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అదే నిజమైతే.. ఆ జంటను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా అని అన్నారు. కాగా.. సోనాక్షి, జహీర్ కొన్నేళ్ల నుంచి డేటింగ్లో ఉంటున్నారని వదంతులు వచ్చాయి. జూన్ 23న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ముంబయిలో జరగబోయే ఈ వివాహానికి ఇప్పటికే కుటుంబసభ్యులు, హీరామండి బృందం సహా పలువురికి ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే శతృఘ్న సిన్హా తాజాగా స్పందించారు.