11-06-2024 RJ
సినీ స్క్రీన్
క్యారక్టర్ నటి సురేఖా వాణి కుమార్తె బండారు సుప్రిత సామాజిక మాధ్యమంలో చాలా చురుకుగా ఉంటోంది. బాలీవుడ్ హీరోయిన్లను అనుసరిస్తూ ఫోటోలకు పోజులిచ్చేస్తోంది. తన అందాలను ఆరబోస్తోంది. సుప్రిత సినిమాలు ఏవిూ ఇంకా విడుదల కాలేదు కానీ ఆమె పేరు మాత్రం బాగా పాపులర్ అవుతోంది. సామజిక మాధ్యమాల్లో ఆమె పోస్టు చేసే ఫోటోలకి నెటిజన్స్ అప్పుడప్పుడూ ఫిదా అవుతూ వుంటారు, అలాగే వాటిపై కామెంట్స్ కూడా చేస్తూ వుంటారు. ఈమధ్య అద్దం ముందు నిలుచొని కొన్ని ఫోటోలు తీసుకున్న సుప్రిత అవి తన ఇన్ట్సాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వాటిపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ నువ్వు అచ్చం జాన్వీ కపూర్ లా వున్నావు అని చెప్పారు ఒకరు. హిందీ నటి జాన్వీ కపూర్ కూడా తన చాలా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ ఉంటుంది. అయితే ఆమె హిందీ నటి, శ్రీదేవి కుమార్తె, ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ పక్కన ’దేవర’ సినిమాలో కథానాయకురాలిగా చేస్తోంది.
అలాగే రామ్ చరణ్ పక్కన దర్శకుడు బుచ్చిబాబు సినిమాలో కూడా చేస్తోంది. అలంటి జాన్వీ కపూర్ ని సురేఖా వాణి కుమార్తె సుప్రిత ఫాలో అవుతోంది అన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే జాన్వీ కపూర్ ఎలా అయితే మంచి గ్లామర్ ఫోటోలు పోస్టు చేస్తూ ఉంటుందో సురేఖ వాణి కుమార్తె కూడా అటువంటి ఫోటోలనే పోస్టు చేస్తూ ఉంటుంది. సుప్రిత ఇప్పుడు ఒక సినిమాలో కథానాయకురాలిగా కూడా అరంగేట్రం చేస్తోంది. అయితే ఆ సినిమా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. సినిమా విడుదలవకముందే తన కేవలం ఫోటోల తోటే సుప్రిత ఇన్ట్సాగ్రామ్ లో బాగా పాపులర్ అయిపొయింది అని అంటున్నారు. ఇప్పుడు సుప్రిత ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.