11-06-2024 RJ
సినీ స్క్రీన్
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం సోమవారం చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతితో ఇటీవల ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి పెళ్లిని కూడా ఇరు కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా నిర్వహించారు.
ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల పెళ్లికి సంబంధించి.. జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక మొదలైంది. జూన్ 8 సంగీత్ కార్యక్రమం జరుపుకుని, జూన్ 10న ఉదయం సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా వివాహమహోత్సవం జరిగింది. కాగా, ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల వెడ్డింగ్ రిసెప్షన్ జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.